‘నిలకడ’గా ఆరోగ్యం!
‘నిలకడ’గా ఆరోగ్యం!
మంచి ఆరోగ్యానికి వ్యాయామం ఒక్కటే సరిపోదు. కూచోవటమూ తగ్గించాలి! ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయమే తేలింది మరి. ఇప్పుడు ఎంతోమంది రోజుకు 10-11 గంటలకు పైగానే ఆఫీసుల్లో కూలబడి పోతున్నారు. ఇలా ఎక్కువసేపు కూచోవటం వల్ల మధుమేహ, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ వంటి ముప్పులెన్నో ముంచుకొస్తాయి. రోజూ వ్యాయామం చేస్తున్నాం కదా అని చాలామంది ఎక్కువసేపు కూచోవటంతో తలెత్తుతున్న అనర్థాలను పెద్దగా పట్టించుకోవటం లేదు. అయితే రోజుకు కనీసం 5 గంటల పాటు నిలబడటం లేదా అటూఇటూ మెల్లగా నడవటం ద్వారా ఇలాంటి వాటిని తప్పించుకోవచ్చని నెదర్లాండ్స్ అధ్యయనం తేల్చి చెబుతోంది. ఇందులో పరిశోధకులు కొందరిని ఎంచుకొని నాలుగేసి రోజుల చొప్పున వివిధ రకాలుగా పరిశీలించారు. ముందుగా రోజులో 14 గంటల సేపు కూచోవాలని చెప్పారు. మరోసారి రోజుకు ఒక గంట సేపు ఎక్సర్సైజ్ సైకిల్ తొక్కటం వంటి కూచొని చేసే వ్యాయామాలను చేయాలని, 13 గంటల సేపు కూచోవాలని చెప్పారు. చివరగా రోజుకు 8 గంటల సేపు కూచోవటం, 5 గంటల సేపు నిలబడటం లేదా అటూఇటూ నడవాలని సూచించారు. అదేపనిగా కూచున్నప్పుడు ఇన్సులిన్ నిరోధకత (కణాలు గ్లూకోజును స్వీకరించలేకపోవటం), కొలెస్ట్రాల్ స్థాయులు గణనీయంగా పెరిగాయి. ఓ గంట సేపు వ్యాయామం చేసి.. ఎక్కువసేపు కూచున్నప్పుడు రక్తనాళాల లోపలి గోడల కణాలు ఆరోగ్యం మెరుగుపడింది గానీ ఇన్సులిన్ నిరోధకత, కొలెస్ట్రాల్ స్థాయుల్లో మార్పేమీ కనబడలేదు. అదే లేచి నిలబడటం, అటూఇటూ నడిచినప్పుడు మాత్రం ఈ రెండూ గణనీయంగా మెరుగుపడటం విశేషం. అంటే వ్యాయామం చేయటమే కాకుండా ఎక్కువసేపు కూచోకుండా చూసుకోవటమూ ముఖ్యమేనని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయన్నమాట. నిలబడినపుడు కండరాలు సంకోచిస్తాయి. దీంతో కండరాలు గ్లూకోజును బాగా వినియోగించుకుంటాయి. ఫలితంగా ఇన్సులిన్ స్థాయులు నిలకడగా కొనసాగుతాయి. చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించే రసాయనాలూ విడుదలవుతాయి. కాబట్టి అదేపనిగా కూచోకుండా అప్పుడప్పుడు లేచి నాలుగడుగులు వేయండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Celebrity Cricket League: సీసీఎల్ మళ్లీ వస్తోంది.. ఆరోజే ప్రారంభం
-
World News
Kim Yo-jong: పశ్చిమ దేశాల ట్యాంకులను రష్యా ముక్కలు చేస్తుంది..!
-
General News
Chandrababu: విషమంగానే తారకరత్న పరిస్థితి.. ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, కుటుంబ సభ్యులు
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Crime News
Viral news: విలేకరిపై అమానుషం.. చెట్టుకు కట్టి.. చితకబాది..!
-
General News
KTR : హిండెన్‌బర్గ్ నివేదికపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు