నీటితోనూ పరిష్కారం

బరువు తగ్గటానికి రకరకాల మార్గాలున్నాయి. ఇంకాస్త ఎక్కువగా నీళ్లు తాగటం కూడా వీటిల్లో ఒకటి. దీంతో కేలరీలు మాత్రమే కాదు...

Published : 19 Jul 2016 02:21 IST

బరువు
నీటితోనూ పరిష్కారం

రువు తగ్గటానికి రకరకాల మార్గాలున్నాయి. ఇంకాస్త ఎక్కువగా నీళ్లు తాగటం కూడా వీటిల్లో ఒకటి. దీంతో కేలరీలు మాత్రమే కాదు.. కొవ్వు, చక్కెర, సోడియం తీసుకోవటం కూడా తగ్గుతున్నట్టు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ అధ్యయనంలో తేలింది.
మనం సగటున రోజుకు 1-2 లీటర్ల నీళ్లు తాగుతామని అంచనా. ఇది రోజు మొత్తమ్మీద తాగే ద్రవాలలో 30% మాత్రమే. మిగతాదంతా కాఫీ, టీ, పండ్ల రసాల వంటి వాటి రూపంలోనూ.. ఆహారంలోని నీటి ద్వారానూ లభిస్తుంది. అయితే దీనికి అదనంగా రోజుకు పావు లీటరు నుంచి ముప్పావు లీటరు నీరు తాగినవారు 68-205 కేలరీలు తక్కువగా తీసుకుంటుండటం గమనార్హం. అలాగే సోడియం 78-235 మిల్లీగ్రాములు, చక్కెర 5-17 గ్రాములు, కొలెస్ట్రాల్‌ 7-21 మిల్లీగ్రాములు తక్కువగా తీసుకుంటున్నట్టూ బయటపడింది. దీనికి కారణం లేకపోలేదు. అదనంగా తీసుకునే నీటితో కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువెక్కువగా తినటం తగ్గటమే కాదు.. కేలరీలు అధికంగా ఉండే తీపి పానీయాలు తాగటమూ తగ్గుతుంది. కేలరీలు, చక్కెర, కొవ్వులు తీసుకోవటం తగ్గితే బరువూ అదుపులో ఉంటుంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే, మూత్ర విసర్జన అనంతరం.. ఇలా వీలైనప్పుడల్లా ఒక గ్లాసు నీరు తాగటం అలవాటు చేసుకుంటే బరువు తగ్గటంతో పాటు ఇతరత్రా సమస్యలనూ నివారించుకునే వీలుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని