ఆందోళనతో నిద్రాభంగమా?

ఆందోళన మోసుకొచ్చే సమస్యల్లో నిద్ర పట్టకపోవటం ఒకటి. అందువల్ల ఆందోళనకు చికిత్స తీసుకోవటంతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించటం మేలు.

Published : 30 Aug 2016 02:16 IST

ఆందోళనతో నిద్రాభంగమా?

ఆందోళన మోసుకొచ్చే సమస్యల్లో నిద్ర పట్టకపోవటం ఒకటి. అందువల్ల ఆందోళనకు చికిత్స తీసుకోవటంతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించటం మేలు.
* రోజూ ఒకే సమయానికి నిద్ర పోవటం, లేవటం అలవాటు చేసుకోవాలి.
* పగటి కాంతి నిద్ర తీరుతెన్నులను ప్రభావితం చేస్తుంది. కాబట్టి రోజుకు కనీసం అరగంట సేపైనా ఒంటికి కాస్త ఎండ తగిలేలా చూసుకోవాలి.
* రోజూ వ్యాయామం చేయటం మానసికోల్లాసానికీ తోడ్పడుతుంది. అయితే పడుకునే ముందు వ్యాయామం చేయటం తగదు.
* పగటిపూట కునుకు తీయాల్సి వస్తే మరీ ఎక్కువసేపు నిద్ర పోవద్దు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అసలు కునుకు తీయకపోవటమే మంచిది.
* కెఫీన్‌తో కూడిన కాఫీ, టీ, చాక్లెట్లు, కూల్‌డ్రింకులకు దూరంగా ఉండాలి.
* పడుకోవటానికి ముందు మద్యం తాగటం, కడుపునిండా భోజనం చేయటం, ఛాతీలో మంట కలిగించే పదార్థాలు తినటం మానెయ్యాలి.
* పొగ తాగటం మానెయ్యాలి. పూర్తిగా మానెయ్యలేకపోతే కనీసం పడుకోవటానికి ఒకట్రెండు గంటల ముందు వరకైనా తాగకుండా చూసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని