పాదాలు పదిలమా?

మన శరీర బరువును మోస్తాయి. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాయి. మనం నడక నేర్చినప్పటి నుంచీ నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి. అయినా ఇతర అవయవాల....

Published : 27 Sep 2016 02:08 IST

పాదాలు పదిలమా?

మన శరీర బరువును మోస్తాయి. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాయి. మనం నడక నేర్చినప్పటి నుంచీ నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి. అయినా ఇతర అవయవాల మాదిరిగా పాదాల ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోం. చూసీ చూడనట్టు వదిలేస్తుంటాం. బిగుతుగా ఉన్నా చెప్పులు, షూ ధరిస్తుంటాం. ఇలాంటివన్నీ పాదాలపై తీవ్రమైన ఒత్తిడి కలగజేస్తాయి. ఏళ్లకేళ్లుగా శ్రమిస్తుండటం వల్ల పాదాలకు రక్త సరఫరా తగ్గటం వంటి జబ్బులూ దాడిచేయొచ్చు. అందువల్ల పాదాలను జాగ్రత్తగా కాపాడుకోవటం ఎంతో అవసరం. వ్యాయామం చేయటం ద్వారా.. ముఖ్యంగా నడకతో పాదాలకు రక్తసరఫరా బాగా మెరుగుపడుతుంది. కుర్చీలో కూచొని మడమలను అటూ ఇటూ గుండ్రంగా తిప్పటం వంటి తేలికైన వ్యాయామాలూ ఎంతో మేలు చేస్తాయి. పాదాల సమస్యలు కొన్నిసార్లు మధుమేహం, కీళ్లవాపు, నాడీ సమస్యల వంటి తీవ్ర జబ్బులకూ తొలి సంకేతం కావచ్చు. వీటిని ముందుగానే గుర్తిస్తే తీవ్రమైన సమస్యల బారినపడకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి పాదాలను ఓ కంటి కనిపెట్టటం మంచిది. ఎక్కడైనాగీసుకుపోవటం, బొబ్బలు, గోళ్లు లోపలి వైపునకు పెరగటం వంటివి ఉన్నాయేమో గమనిస్తుండాలి. పాదాల్లో తీవ్రమైన నొప్పి, మొద్దుబారటం వంటివి కనిపిస్తే తాత్సారం చేయకుండా డాక్టర్‌ను కలవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని