గుండెను ‘నొప్పించొద్దు!

చీటికీ మాటికీ నొప్పిని తగ్గించే మందులు వేసుకుంటున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలా తరచుగా వాడే డైక్లోఫెనాక్‌, ఐబూప్రొఫెన్‌, నిమెసులైడ్‌ వంటి నొప్పి .....

Published : 18 Oct 2016 01:55 IST

గుండెను ‘నొప్పించొద్దు!

చీటికీ మాటికీ నొప్పిని తగ్గించే మందులు వేసుకుంటున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలా తరచుగా వాడే డైక్లోఫెనాక్‌, ఐబూప్రొఫెన్‌, నిమెసులైడ్‌ వంటి నొప్పి నివారణ మందులతో గుండె వైఫల్యం ముప్పు 19 శాతం వరకు పెరుగుతున్నట్టు బయటపడింది మరి! మందుల మోతాదు పెరిగిన కొద్దీ ఈ ముప్పూ ఎక్కువవుతుండటం గమనార్హం. నొప్పి నివారణ మందులు ఒంట్లో నీరు, ఉప్పు పోగుపడేలా చేస్తాయి. దీంతో రక్తపోటు పెరుగుతుంది. ఇది క్రమంగా గుండె వైఫల్యానికి దారితీస్తున్నట్టు పరిశోధకులు అనుమానిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు