కమిలితే?

గట్టిగా దెబ్బతగిలినపుడు కొన్నిసార్లు వెంటనే చర్మం కమలినట్టు అవుతుంటుంది. దీనికి కారణం గాయం మూలంగా దెబ్బతిన్న రక్తనాళం నుంచి రక్తం...

Published : 01 Nov 2016 01:18 IST

కమిలితే?

ట్టిగా దెబ్బతగిలినపుడు కొన్నిసార్లు వెంటనే చర్మం కమలినట్టు అవుతుంటుంది. దీనికి కారణం గాయం మూలంగా దెబ్బతిన్న రక్తనాళం నుంచి రక్తం లీకై చర్మం పైపొరలకు చేరుకోవటమే. దీంతో ఆ భాగమంతా నీలంగా గానీ వూదాగా లేదా నల్లగా గానీ అవుతుంది. ఇలాంటి సమయంలో కొందరు గట్టిగా రుద్దటం, మర్దన చేయటం వంటివి చేస్తుంటారు. ఇలా మంచిది కాదు. వీటితో సమస్య మరింత తీవ్రం కావొచ్చు. కమిలిన చోట వెంటనే మంచుగడ్డల సంచిని (ఐస్‌ప్యాక్‌) పెట్టటం మంచిది. చల్లటి నీటితో ముంచిన గుడ్డతోనైనా అద్దుతూ ఉండాలి. ఇవి వాపు, నొప్పి తగ్గటానికి దోహదం చేస్తాయి. కాలు కమిలితే.. కింద దిండు వంటివి పెట్టి కాలు కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని