కోపంతో నిద్రపోవద్దు

రాత్రి పూట మంచి పుస్తకం చదవటం, సంగీతం వినటం వంటి పనులు మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి. నిద్ర కూడా హాయిగా పడుతుంది. దీన్ని పరిశోధనలు కూడా బలపరస్తున్నాయి. కోపంతో నిద్ర పోవటం ఏమాత్రం మంచిది కాదని తాజా అధ్యయనం పేర్కొంటోంది.

Published : 13 Dec 2016 01:30 IST

కోపంతో నిద్రపోవద్దు

రాత్రి పూట మంచి పుస్తకం చదవటం, సంగీతం వినటం వంటి పనులు మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి. నిద్ర కూడా హాయిగా పడుతుంది. దీన్ని పరిశోధనలు కూడా బలపరస్తున్నాయి. కోపంతో నిద్ర పోవటం ఏమాత్రం మంచిది కాదని తాజా అధ్యయనం పేర్కొంటోంది. దీంతో అనవసర విషయాలను మరచిపోయే ప్రక్రియ దెబ్బతింటోందని చెబుతోంది. సాధారణంగా మనం నిద్రపోయినప్పుడు రోజంతా సేకరించిన సమాచారాన్ని మెదడు విడదీసుకుంటుంది. అవసరమైన విషయాలను జ్ఞాపకాలుగా పదిలపరచుకుంటుంది. అనవసరమైన వాటిని వదిలించుకుంటుంది. అయితే కోపంతో నిద్రకు ఉపక్రమిస్తే.. మనం తిరిగి గుర్తుకు తెచ్చుకోవద్దని అనుకునే విషయాలు మరుగునపడే ప్రక్రియ తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అందువల్ల ఏవైనా విభేదాలు, అభిప్రాయభేదాలుంటే పడుకునే ముందే పరిష్కరించుకోవటం మంచిదని సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని