జీవక్రియలు పుంజుకునేలా..

శరీరంలోని ప్రతి కణానికీ శక్తి అవసరం. ఇది మనం తినే తిండి నుంచే లభిస్తుంది. ఆహారం ద్వారా లభించే పోషకాలను ఇలా శక్తిగా మలిచే చర్యలను జీవక్రియలు (మెటబాలిజం) అంటాం. వయసు మీద పడుతున్నకొద్దీ వీటి వేగం మందగిస్తుంటుంది.

Published : 07 Mar 2017 01:49 IST

జీవక్రియలు పుంజుకునేలా..

రీరంలోని ప్రతి కణానికీ శక్తి అవసరం. ఇది మనం తినే తిండి నుంచే లభిస్తుంది. ఆహారం ద్వారా లభించే పోషకాలను ఇలా శక్తిగా మలిచే చర్యలను జీవక్రియలు (మెటబాలిజం) అంటాం. వయసు మీద పడుతున్నకొద్దీ వీటి వేగం మందగిస్తుంటుంది. దీంతో బరువు పెరగటం, చురుకుదనం తగ్గటం వంటివన్నీ మొదలవుతాయి. అయితే కొన్ని జాగ్రత్తలతో వీటి వేగాన్ని తిరిగి పుంజుకునేలా చేసుకోవచ్చు.

* ఉదయం పూట వీలైనంత త్వరగా అల్పాహారం తీసుకుంటే జీవక్రియలు చురుకుగా సాగటానికి దోహదం చేస్తుంది. అలాగే రాత్రిపూట భోజనం చేసిన వెంటనే నిద్రపోకుండానూ చూసుకోవాలి.
* ఐరన్‌ లోపిస్తే ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గి.. జీవక్రియల వేగమూ మందగిస్తుంది. కాబట్టి ఆకుకూరలు, చిక్కుడు జాతి కూరగాయలు తినటం మంచిది.
* పరిమితంగా కాఫీ తాగినా మేలే. దీనిలోని కెఫీన్‌ కేంద్ర నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. శ్వాస, గుండె వేగంతో పాటు జీవక్రియల వేగాన్నీ పెంచుతుంది.
* కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు, తగినంత ప్రోటీన్‌ తీసుకోవటం కూడా జీవక్రియల చురుకుదనానికి తోడ్పడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని