కట్టుడు పళ్లా?
కట్టుడు పళ్లా?
కట్టుడుపళ్లను జాగ్రత్తగా కాపాడుకుంటే ఎక్కువకాలం మన్నుతాయి. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు వీటిని తప్పకుండా తీసేయాలి. దీంతో చిగుళ్లకూ తగినంత విశ్రాంతి లభిస్తుంది. వీటిని పళ్లను శుభ్రం చేయటానికి తోడ్పడే మాత్రను కలిపిన నీటిలో వేసి ఉంచాలి. ఫలితంగా పళ్లు పొడిబారకుండా ఉంటాయి. కట్టుడుపళ్లను కూడా మామూలు దంతాల మాదిరిగానే రోజూ బ్రష్‌తో పూర్తిగా తోముకోవాలి. సహజ దంతాలు ఏవైనా ఉంటే వాటిని కూడా.. ముఖ్యంగా చిగురు, దంతం కలిసే చోట శుభ్రం చేసుకోవాలి. చిగుళ్ల, దవడల ఆకారం పెద్దగా మారకపోతే.. కట్టుడుపళ్లు 6 నెలల నుంచి ఐదేళ్లు, అంతకన్నా ఎక్కువకాలం మన్నుతాయి. అలాగని నిర్లక్ష్యం చేయటం పనికిరాదు. పూర్తిగా కట్టుడుపళ్లు ధరించేవారు కనీసం రెండేళ్లకు ఒకసారైనా దంతవైద్యుడిని సంప్రదించాలి. అక్కడక్కడా దంతాలు వూడిపోయి, వాటి కోసం కట్టుడుపళ్లను ధరించేవారైతే ఆర్నెల్లకు ఓసారి డాక్టర్‌ను సంప్రదించి పరీక్షించుకోవాల్సి ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
టికెట్ అడిగారని.. చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..
-
India News
SJM: సంపన్నులకు పన్ను రాయితీ కాదు.. వారి పాస్‌పోర్టులు రద్దు చేయాలి : ఎస్జేఎం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: కోటంరెడ్డిని తప్పించి.. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డికి బాధ్యతలు
-
Movies News
Chiranjeevi: ఉదారత చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏకంగా రూ.5 లక్షలు ఆర్థికసాయం
-
General News
ED: మద్యం కుంభకోణం మనీలాండరింగ్ కేసు.. ఈడీ ఛార్జిషీట్లో కేజ్రీవాల్, కవిత పేర్లు