పుండు మానదేం?
పుండు మానదేం?
చర్మం మీద ఎక్కడ పుండు పడినా ఇబ్బందే. గీసుకోవటం, కోసుకుపోవటం వంటి పైపై గాయాలకు ప్రథమ చికిత్స చేసి, కట్టుకడితే తేలికగానే మానిపోతాయి. కానీ చర్మం లోలోతుల్లోకి చొచ్చుకెళ్లే పుండ్ల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఏమాత్రం అశ్రద్ధ చూపినా ఇన్ఫెక్షన్ తలెత్తొచ్చు. అలాగే కండరం, ఎముక, స్నాయువులు, నాడుల వంటివి దెబ్బతినొచ్చు కూడా. కొన్నిసార్లు అవయవాలు తొలగించాల్సిన పరిస్థితికీ దారితీస్తుంది. ఇలా దీర్ఘకాలం వేధించే పుండ్లలో చాలా రకాలున్నాయి.
* బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు సరైన చికిత్స తీసుకోకపోవటం వల్ల కొందరికి దీర్ఘకాలంగా పుండ్లు మానకుండా వేధిస్తుంటాయి.
* తీవ్రంగా గాయమైనప్పుడు రక్తప్రసరణ తెగిపోవటం వల్ల తగినంత ఆక్సిజన్, పోషకాలు అందకపోవటం కూడా కొందరిలో దీర్ఘకాల పుండ్లు తలెత్తుతుంటాయి.
* జబ్బులతో దీర్ఘకాలం మంచాన పడ్డవారికి, గంటలకొద్దీ చక్రాల కుర్చీలో కూచునేవారికి చర్మం మీద ఒత్తిడి పడి, రక్తప్రసరణ దెబ్బతినటం వల్ల పుండ్లు పడుతుంటాయి. మధుమేహులకు, కాళ్లలోని రక్తనాళాల్లో సమస్యలు గలవారికి, పోషణలోపం గలవారికి కూడా వీటి ముప్పు ఎక్కువే. ఇవి ఒక పట్టాన మానవు.
నివారణ-చికిత్స
దీర్ఘకాల పుండ్లకు దారితీసే ముప్పులను నివారించుకోవటమే అన్నింటికన్నా ఉత్తమమైన పద్ధతి. పుండు పడిన చోట శుభ్రంగా ఉంచుకోవటం, డాక్టర్ చెప్పినట్టుగా మందులు వాడుకోవటం తప్పనిసరి. ఎక్కువసేపు ఒకే వైపు పడుకోకుండా చూసుకోవటం, తరచుగా పక్కలకు దొర్లటం ద్వారా ఒత్తిడి పుండ్లు పడకుండా చూసుకోవచ్చు. దీర్ఘకాల పుండ్ల చికిత్సలో వాటికి దారితీస్తున్న కారణాలను తగ్గించటానికే ప్రాధాన్యం ఇస్తారు. కొందరిలో పుండ్లు తలెత్తిన చోట మృత కణజాలాన్ని తొలగించాల్సి ఉంటుంది. దీంతో రక్తప్రసరణ మెరుగుపడి.. పుండు పడిన భాగానికి తగినంత ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. తరచుగా కట్టు మారుస్తుండటం, పుండ్లును శుభ్రం చేయటం, యాంటీబయోటిక్ మందులు రాయటం, అవసరమైతే నొప్పి నివారణ మందులు వాడుకోవటం ద్వారా పుండ్లు త్వరగా మానేలా చూసుకోవచ్చు. అయితే పుండ్లు మొండిగా మారాక బాధపడటం కన్నా అవి తలెత్తకుండా చూసుకోవటమే మేలు. ఇందుకు ఆరోగ్యకరమైన జవనశైలిని పాటించటం.. మధుమేహం, కాలి రక్తనాళాల్లో పూడికల వంటి ఆయా జబ్బులను నియంత్రణలో ఉంచుకోవటం ఉత్తమం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: అలాంటి వికెట్లు తయారు చేయండి.. ఆసీస్ తప్పకుండా గెలుస్తుంది: ఇయాన్ హీలీ
-
World News
టికెట్ అడిగారని.. చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..
-
India News
SJM: సంపన్నులకు పన్ను రాయితీ కాదు.. వారి పాస్‌పోర్టులు రద్దు చేయాలి : ఎస్జేఎం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: కోటంరెడ్డిని తప్పించి.. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డికి బాధ్యతలు
-
Movies News
Chiranjeevi: ఉదారత చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏకంగా రూ.5 లక్షలు ఆర్థికసాయం