కడుపు ‘నింపే’ అక్రోటు!

బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌ వంటి ఎండు ఫలాలు, గింజపప్పులు (నట్స్‌) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి...

Published : 19 Sep 2017 01:59 IST

కడుపు ‘నింపే’ అక్రోటు!

బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌ వంటి ఎండు ఫలాలు, గింజపప్పులు (నట్స్‌) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తక్కువ పరిమాణంలోనే ఎక్కువ శక్తిని, పోషకాలను అందజేస్తాయి. ఇవి కడుపు నిండిన భావన కలిగించి, ఆకలి తగ్గటానికీ తోడ్పడతాయి. ముఖ్యంగా అక్రోట్లు (వాల్‌నట్స్‌) మంచి ప్రభావం చూపుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. మనం భోజనం చేస్తున్నప్పుడు కడుపు నిండిందనే భావన కలగటం, ఆకలిని తగ్గించటంలో మెదడులోని ఇన్సులా అనే భాగం పాలు పంచుకుంటుంది. రోజూ అక్రోట్లు తినేవారిలో ఇది మరింత చురుకుగా స్పందిస్తున్నట్టు తేలటం విశేషం. అక్రోట్లు తిన్నప్పుడు కడుపు నిండిన భావన కలుగుతుందని చాలామంది చెబుతూనే ఉంటారు, అయితే దీని వెనకగల కారణమేంటో బయట పడటం ఆసక్తి కలిగిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఆకలి ప్రక్రియను మరింత బాగా అర్థం చేసుకోవటానికిది తోడ్పడుతుందని.. మున్ముందు దీని ఆధారంగా కొత్త మందులు పుట్టుకొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని వివరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని