ఆస్థమాకూ ప్రథమ చికిత్స

ఆస్థమాతో బాధపడేవారికి అది ఎప్పుడు ఉద్ధృతమవుతుందో తెలియదు. పుప్పొడులు, దమ్ము ధూళి, జంతువుల బొచ్చు, పొగ, చల్లటి గాలి, ఛాతీ ఇన్‌ఫెక్షన్ల వంటి కారకాలు ఏవైనా ఆస్థమాను ప్రేరేపించొచ్చు. దీంతో ఉన్నట్టుండి ఆయాసం, మాట్లాడటంలో ఇబ్బంది, విడవకుండా దగ్గు, చర్మం రంగు మారటం.. ముఖ్యంగా పెదవులు, వేళ్ల చివర్లు నీలంగా మారటం వంటి లక్షణాలు మొదలవుతాయి. ఇలాంటి సమయంలో పక్కనుండేవారికీ ఏం చేయాలో పాలుపోదు. తెగ గాబరా పడిపోతుంటారు. అయితే కాస్త నిబ్బరంగా ఉండటం, చేతనైన సాయం చేయటం ఎంతో మంచిది.

Published : 31 Oct 2017 01:37 IST

ఆస్థమాకూ ప్రథమ చికిత్స

స్థమాతో బాధపడేవారికి అది ఎప్పుడు ఉద్ధృతమవుతుందో తెలియదు. పుప్పొడులు, దమ్ము ధూళి, జంతువుల బొచ్చు, పొగ, చల్లటి గాలి, ఛాతీ ఇన్‌ఫెక్షన్ల వంటి కారకాలు ఏవైనా ఆస్థమాను ప్రేరేపించొచ్చు. దీంతో ఉన్నట్టుండి ఆయాసం, మాట్లాడటంలో ఇబ్బంది, విడవకుండా దగ్గు, చర్మం రంగు మారటం.. ముఖ్యంగా పెదవులు, వేళ్ల చివర్లు నీలంగా మారటం వంటి లక్షణాలు మొదలవుతాయి. ఇలాంటి సమయంలో పక్కనుండేవారికీ ఏం చేయాలో పాలుపోదు. తెగ గాబరా పడిపోతుంటారు. అయితే కాస్త నిబ్బరంగా ఉండటం, చేతనైన సాయం చేయటం ఎంతో మంచిది.

* ముందుగా ఆస్థమా బాధితులను కుర్చీ మీద కూచోబెట్టటం మంచిది. చేతులు టేబుల్‌ మీద ఆనించి, కొంచెం ముందుకు వంగేలా కూచోబెట్టాలి. దీంతో శ్వాస తీసుకోవటం తేలికవుతుంది.

* ఆ తర్వాత ఆస్థమా బాధితుల దగ్గర ఇన్‌హేలర్లలో రిలీవర్‌ మందు, స్పేసర్‌ ఉన్నాయేమో చూడాలి. స్పేసర్‌తో ఒకసారి ఒక మోతాదు చొప్పున ఆరుసార్లు మందు పీల్చుకునేలా చేయాలి. ఒకవేళ ఫలితం కనబడకపోతే సుమారు 6 నిమిషాల తర్వాత మరోసారి స్పేసర్‌తో మందు పీల్చుకునేలా చూడాలి. లక్షణాలు తగ్గుముఖం పడితే చర్మం మామూలు రంగులోకి వచ్చేంతవరకు విశ్రాంతిగా ఉండేలా చూడాలి

* ఒకవేళ రిలీవర్‌ మందు ఇచ్చినా ఫలితం కనబడకపోతే, బాధితుల దగ్గర మందులేవీ అందుబాటులో లేకపోతే వెంటనే అత్యవసర చికిత్స కోసం అంబులెన్స్‌కు ఫోన్‌ చేయాలి. ఆస్థమా బాధితుల చుట్టూ గుమిగూడొద్దు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని