కళ్లు తెరవండి
కళ్లు తెరవండి
ఒక్కసారి కళ్లు మూసుకొని నడిచి చూడండి. పట్టుమని నాలుగడుగులైనా సరిగా వేయలేం. ఇంద్రియాలన్నింటిలోకీ కన్ను అతి ప్రధానమైనదని అనటానికి ఇదే నిదర్శనం. మనం ఏ పని చేయాలన్నా చూపు చాలా కీలకం. మరి ఇంతటి అమూల్యమైన చూపును ప్రసాదించే కళ్లను సరిగా కాపాడుకుంటున్నామా? నిజానికి లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే కళ్ల గురించి, చూపును దెబ్బతీసే అంశాల గురించి చాలామందికి సరైన అవగాహనే ఉండటం లేదు. పైగా ఎన్నెన్నో అపోహలూ రాజ్యమేలుతున్నాయి. వీటిల్లో నిజమెంతో ఓసారి చూద్దాం.
* తక్కువ వెలుతురులో చదివితే చూపు తగ్గిపోతుందని కొందరు అనుకుంటుంటారు. ఇది నిజం కాదు. అయితే మసక వెలుతురులో చదివితే కళ్లు చాలా త్వరగా అలసిసోతాయి. కాబట్టి పుస్తకం మీద నేరుగా వెలుతురు పడేలా లైటును అమర్చుకొని చదువుకోవటం మంచి పద్ధతి.
* కళ్లకు మేలు చేయటంలో క్యారెట్లను మించినవి లేవనేది మరికొందరి భావన. క్యారెట్‌లోని విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఒక్క క్యారెట్లోనే కాదు.. పాలు, ఛీజ్, గుడ్డులోని పచ్చసొన వంటి వాటిల్లోనూ విటమిన్ ఎ ఉంటుంది. అలాగే తాజా పండ్లు, ఆకుకూరలను తక్కువ చేయటానికీ లేదు. వీటిల్లో విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి వయసుతో పాటు దాడిచేసే శుక్లాలు, రెటీనా మధ్యభాగం క్షీణించటం (మాక్యులర్ డీజెనరేషన్) వంటి సమస్యల బారినపడకుండానూ కాపాడతాయి.
* కళ్లద్దాలు లేదా కాంటాక్ట్ లెన్సులను రోజంతా పెట్టుకోవటం మంచిది కాదని, దీంతో కళ్లు వాటికి అలవాటు పడిపోతాయనేది ఇంకొందరి అపోహ. ఇందులో ఏమాత్రం నిజం లేదు. హ్రస్వ దృష్టి లేదా దూర దృష్టి.. సమస్య ఏదైనా డాక్టర్లు సిఫారసు చేసిన కళ్లద్దాలు లేదా లెన్సులు తప్పకుండా వాడుకోవాలి. సాధారణంగా వయసు మీద పడటం వల్లనో, జబ్బుల మూలంగానో కంటి అద్దాల పవర్ మారుతుంటుంది. అప్పుడు కొత్త అద్దాలు తీసుకోవాల్సి వస్తుంది. అంతే తప్ప కళ్లద్దాలు, లెన్సులతో చూపు తగ్గటం, కళ్లు దెబ్బతినటం వంటి ముప్పులేవీ ఉండవు. పైగా అద్దాలు పెట్టుకోకపోతే కళ్లు ఒత్తిడికి లోనవ్వొచ్చు.
* అదేపనిగా కంప్యూటర్ వైపు చూడటం కళ్లకు హానికరమని కొందరు భావిస్తుంటారు. దీంతో కళ్లు అలసిపోవటం, ఒత్తిడికి లోనవటం సహజమే గానీ చూపేమీ దెబ్బతినదు. అయితే ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూచోవాల్సి వస్తే మధ్య మధ్యలో కాసేపు విరామం తీసుకోవటం మంచిది. అలాగే తరచుగా కంటి రెప్పలను ఆడిస్తుండాలనే విషయాన్ని మరవరాదు. దీంతో కళ్లు పొడిబారకుండా చూసుకోవచ్చు.
* కంటి వ్యాయామాలు చేస్తే కళ్లద్దాలు ధరించాల్సిన అవసరం తప్పుతుందని కొందరు అనుకుంటుంటారు. కంటి వ్యాయామాలతో కంటి కండరాలు బలోపేతం కావొచ్చేమో గానీ తగ్గిపోయినన చూపు తిరిగి మామూలు స్థాయికేమీ రాదు. కంటి ఆకృతి, కంటి కణజాలం వంటివి కంటి వ్యాయామాలతో మారిపోవు.
* చూపు తగ్గటాన్ని ఆపలేమని మరికొందరు అనుకుంటుంటారు. చూపు మసకబారటం, కంటి నొప్పి, మిరుమిట్లు గొలిపే కాంతులు మెరవటం వంటి లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్üను సంప్రతించటం మంచిది. కారణాన్ని వీలైనంత త్వరగా గుర్తిస్తే తగు చికిత్సలతో సరి చేయొచ్చు. కనీసం చూపు తగ్గటాన్నయినా నెమ్మదింపజేయొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: స్పిన్ ఎదుర్కోవడం కోహ్లీకి కాస్త కష్టమే.. కింగ్‌కు మాజీ ఆటగాడి సూచన ఇదే..!
-
India News
అలా చేస్తే.. 2030 కల్లా భారత్ దివాలా తీయడం ఖాయం: హరియాణా సీఎం కీలక వ్యాఖ్యలు
-
World News
Chinese spy balloon: అమెరికా అణ్వాయుధ స్థావరంపై చైనా నిఘా బెలూన్..!
-
Politics News
Kotamreddy: అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్.. ఆషామాషీగా జరగదు: కోటంరెడ్డి
-
India News
Air India Express: గగనతలంలో ఇంజిన్‌లో మంటలు.. విమానానికి తప్పిన ముప్పు
-
Movies News
K Vishwanath: కె.విశ్వనాథ్ ఖాకీ దుస్తుల వెనుక కథ ఇది!