ఆస్థమాతో కాస్త జాగ్రత్త!
చలి వాతావరణం ఆస్థమా బాధితులకు మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతుంది. బయటికి వెళ్తే చల్లగాలిని పీల్చటం మూలంగా ఆస్థమా ఉద్ధృతం కావొచ్చు. ఇక ఎప్పుడూ ఇంట్లోనే ఉండిపోతే ఆస్థమాను ప్రేరేపించే పెంపుడు జంతువుల బొచ్చు, నూగు, మృత చర్మకణాలు.....
ఆస్థమాతో కాస్త జాగ్రత్త!
చలి వాతావరణం ఆస్థమా బాధితులకు మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతుంది. బయటికి వెళ్తే చల్లగాలిని పీల్చటం మూలంగా ఆస్థమా ఉద్ధృతం కావొచ్చు. ఇక ఎప్పుడూ ఇంట్లోనే ఉండిపోతే ఆస్థమాను ప్రేరేపించే పెంపుడు జంతువుల బొచ్చు, నూగు, మృత చర్మకణాలు.. తవిటి పురుగులు, వంటింటి పొగ వంటివి శ్వాస ద్వారా లోనికి వెళ్లొచ్చు. కాబట్టి చలికాలంలో కాస్త జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం.
ప్రేరకాలపై కన్నేయండి
దుమ్ముధూళి, చల్లగాలి వంటి ఆస్థమా ప్రేరకాలు శ్వాస ద్వారా లోనికి వెళ్లినపుడు వూపిరితిత్తుల్లోని శ్వాసమార్గాలు బిగుసుకుపోతాయి. జిగురుద్రవం బయటకు రాకుండా అక్కడే చిక్కుకుపోతుంది. దీంతో దగ్గు, పిల్లికూతలు, ఆయాసం వంటి లక్షణాలు పొడసూపుతాయి. అందువల్ల ఆస్థమా ఉద్ధృతం కావటానికి దోహదం చేసే కారకాలను గుర్తించి, వాటికి దూరంగా ఉండటం మంచిది.
* వీలైనంతవరకు కుక్కలు, పిల్లుల వంటి పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం, వాటిని పడకగదిలోకి రానీయకుండా చూసుకోవటం మంచిది. అలాగే పడకగదిలో అలర్జీ కారకాలేవీ లేకుండానూ చూసుకోవాలి. తవిటి పురుగులతో ఆస్థమా ఉద్ధృతమవుతుందోని అనిపిస్తే దుప్పట్లు, దిండ్లు, పరుపులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
* గోడలకు చెమ్మ, బూజు వంటివి తలెత్తకుండా చూసుకోవాలి. తేమగా ఉండే ప్రాంతాల్లో నాచు, తవిటి పురుగుల వంటివి త్వరగా వృద్ధి చెందుతాయి. ఇవి అలర్జీని ప్రేరేపిస్తాయి. కాబట్టి ఇంటిని పొడిగా ఉంచుకోవాలి. పైపులు లీకు కాకుండా, కిటికీ తలుపులకు రంధ్రాలు లేకుండా చూసుకోవాలి. వంటింట్లోంచి వెలువడే పొగ, ఘాటైన వాసనలతోనూ ఆస్థమా ఉద్ధృతం కావొచ్చు. అందువల్ల వంటింల్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు అమర్చుకోవాలి.
* చలికాలంలో జలుబు, ఫ్లూ సైతం మరింత ఎక్కువగా దాడి చేస్తుంటాయి. దీంతో ఆస్థమా కూడా ఉద్ధృతం కావొచ్చు. కాబట్టి జలుబు, ఫ్లూతో బాధపడేవారికి దూరంగా ఉండటం.. తరచుగా చేతులు కడుక్కోవటం, ఫ్లూ టీకా తీసుకోవటం మంచిది.
* బయటకు వెళ్లినపుడు తలకు మఫ్లర్ చుట్టుకోవాలి లేదా మంకీ క్యాప్ పెట్టుకోవాలి.చలి ఎక్కువగా ఉండే సమయాల్లో ఆరుబయట కాకుండా ఇంట్లో లేదా జిమ్లో వ్యాయామం చేయాలి.
* ఆస్థమా బాధితులు తక్షణం ఉపశమనం కలిగించే రిలీవర్ మందులతో పాటు ఆస్థమాను నియంత్రించే కంట్రోలర్లనూ వాడుకోవాల్సి ఉంటుంది. చాలామంది లక్షణాలేవీ కనబడటం లేదని కంట్రోలర్లను తీసుకోవటం మానేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. చాలాకాలంగా ఆస్థమా లక్షణాలు కనబడకపోయినా డాక్టర్ సూచించిన పద్ధతిలో విధిగా మందులు వాడుకోవాలి. చలికాలంలో ఇది మరింత అవసరం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!