వంటింటి దినుసులతోనే వాపును ఎదుర్కొందాం!
వంటింటి దినుసులతోనే వాపును ఎదుర్కొందాం!
మనం ప్లేగు, క్షయ వంటి ఎన్నో రకాల మొండి వ్యాధులను జయించాం. యాంటీబయాటిక్స్‌తో ఇన్ఫెక్షన్లను తేలికగానే వదిలించుకుంటున్నాం. అత్యాధునికమైన చికిత్సలతో గుండె జబ్బులు, పక్షవాతం, ఉబ్బసం వంటి చాలా వ్యాధులనూ సమర్థంగానే ఎదుర్కొనగలుగుతున్నాం. కానీ ఒక రకంగా ఈ గుండెజబ్బుల వంటివన్నీ మనం తీసుకునే ఆహారం, మన రోజువారీ ఆలవాట్లు, శారీరక వ్యాయామం వంటివాటితో బలంగా ముడిపడిన వ్యాధులు. అందుకే వీటిని జీవనశైలీ వ్యాధులని కూడా అంటున్నారు. క్యాన్సర్‌తో సహా ఇలాంటి జీవనశైలీ జబ్బులను లోతుగా పరిశోధించినప్పుడు ఇలాంటి చాలా వ్యాధులకు మూలం.. మన ఒంట్లో తలెత్తే ‘వాపు’ ప్రక్రియలో కనబడుతోంది. ఒకరకంగా మనకు ‘వాపు’ అనేది తెలియనిదేం కాదు. దెబ్బ తగిలితే అక్కడ వాస్తుంది. బెణికితే వాస్తుంది. ఇదంతా బయటి నుంచి జరిగిన నష్టానికి మన శరీరం స్పందన. ఆ నష్టాన్ని పూడ్చుకునే, దెబ్బను మాన్పుకునే ప్రక్రియలో భాగం. ఈ వాపు పైకి కనిపిస్తుంది కాబట్టి మనం దీన్ని గుర్తిస్తున్నాం. అయితే ఇలా బయటకు కనిపించకుండా.. మన లోలోపల రకరకాల అవయవాల్లో, రకరకాల వ్యవస్థల్లో కూడా వాపు లాంటి మార్పు తలెత్తుతుంటుంది. దీన్నే ‘ఇన్‌ఫ్లమేటరీ ప్రాసెస్’ అంటారు. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న చాలా రకాల దీర్ఘకాలిక సమస్యలకు లోలోపల ఈ ‘వాపు’ తరహా మార్పులు కారణమవుతున్నాయని ఆధునిక వైద్యరంగం స్పష్టంగా గుర్తించింది. ముఖ్యంగా గుండె జబ్బులు, పక్షవాతం, కొన్ని రకాల క్యాన్సర్లు, కీళ్లవాపులు, కొన్ని రకాల చర్మవ్యాధులు.. వీటన్నింటి వెనకా... ఎంతోకొంత ఈ ‘వాపు’ మార్పుల పాత్ర ఉంటోందని తేలటం విశేషం. కాబట్టి వాపు తరహా మార్పులను ముందు నుంచీ సమర్థంగా ఎదుర్కొంటే మనం చాలా రకాల జబ్బులను మూలాల్లోనే నివారించుకోవచ్చు. అందుకోసమే ఈ ‘వాపు’కు తేలికైన విరుగుడు కనుగొనేందుకు వైద్యపరిశోధనా రంగం విస్తృతంగా కృషి చేస్తోంది. అదృష్టవశాత్తూ.. దీన్ని ఎదుర్కొనటంలో మనం రోజువారీ ఇంట్లో వాడుకునే రకరకాల ఆహార పదార్ధాలు, ముఖ్యంగా కొన్ని రకాల దినుసులు, సుగంధ ద్రవ్యాలు బాగానే ఉపకరిస్తున్నాయని బయటపడింది. ముఖ్యంగా పసుపు, వెల్లుల్లి వంటి వాటిలో ఉండే మూల ద్రవ్యాలు- వాపునూ, మన శరీరంలో ఒక పరంపరగా అది సృష్టించే విలయాన్నీ నివారించటంలో కొంత ముఖ్యపాత్రే పోషిస్తున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో రోజూ పాలలో పసుపు వేసుకుని తాగటమన్నది ఇటీవలి కాలంలో తరచూ చర్చల్లోకి వస్తోంది. ఇది ఏకంగా ‘గోల్డెన్ మిల్క్’ పేరుతో విస్తృత ప్రాచుర్యంలోకి వస్తోంది. ఇవన్నీ చిరకాలంగా మనకు తెలిసినవే అయినా.. వీటికి సరికొత్త ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, ఇవి ఆధునిక కాలంలో మనల్ని వేధిస్తున్న చాలా వ్యాధులకు విరుగుడుగా కూడా పని చేస్తాయని తేలటం.. మనం తప్పకుండా గుర్తించాల్సిన విశేషం.
|
పసిడిపాలు!
పసిడిపాలు: దీన్నే గోల్డెన్ మిల్క్ అని వ్యవహరిస్తున్నారు. గోరువెచ్చని పాలల్లో అరచెంచా పసుపు వేసుకుని తాగితే ఇన్‌ఫ్లమేషన్ నుంచి ఉపశమనం కలుగుతుంది. పసుపులోని కర్‌క్యుమిన్ అనే శక్తివంతమైన పాలిఫినాల్‌కు గాయాలను మాన్పే గుణం, చీముపట్టకుండా చూసే లక్షణమే (యాంటిసెప్టిక్) కాదు.. యాంటిఆక్సిడెంట్ గుణాలూ దండిగా ఉన్నాయ. అందుకే పసుపు వేసిన పాలని తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పాలల్లోనే అరచెంచా మిరియాల పొడి వేసుకుంటే మరీ మంచిది. వీటకి తోడు దాల్చిన చెక్క, తేనె, దంచిన అల్లం కూడా కలుపుకోవచ్చు. ఇవి పడని వారు.. గుండెల్లో మంట, అసిడిటీ బాధలున్నవారు పసుపు వేసుకుంటే చాలు.
|
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
SJM: సంపన్నులకు పన్ను రాయితీ కాదు.. వారి పాస్‌పోర్టులు రద్దు చేయాలి : ఎస్జేఎం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: కోటంరెడ్డిని తప్పించి.. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డికి బాధ్యతలు
-
Movies News
Chiranjeevi: ఉదారత చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏకంగా రూ.5 లక్షలు ఆర్థికసాయం
-
General News
ED: మద్యం కుంభకోణం మనీలాండరింగ్ కేసు.. ఈడీ ఛార్జిషీట్లో కేజ్రీవాల్, కవిత పేర్లు
-
Crime News
కారు ప్రమాదం.. కళ్లముందే నిండు గర్భిణీ, భర్త సజీవదహనం