చర్మం పొడిబారకుండా...
చలికాలం
చర్మం పొడిబారకుండా...
శీతాకాలం ఎక్కువగా వేధించే సమస్య పొడిచర్మం. కారణం.. వేడి వేడి నీటితో స్నానం చేయడం, గాఢత ఎక్కువగా ఉండే సబ్బులు వాడటం.. కొంత వరకూ వయసు కూడా! చలికాలం ఒంట్లో తేమ తగ్గి చర్మం దురద, పగిలిపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. అలా కాకుండా చర్మం మృదువుగా ఉండాలంటే...
* మనం ముందుగా చేయాల్సిన పని.. చర్మానికి తేమను అందించడం లేదా చర్మం తేమను కోల్పోకుండా చూడ్డం. పెట్రోలియం జెల్లీ, మినరల్ ఆయిల్స్ వంటివి ఇందుకు సహకరిస్తాయి. వీటిని పైపూతగా ఉపయోగించడం వల్ల చర్మం తేమతో నిగారిస్తుంది.
* చలి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు గదిలో హ్యుమిడిఫైయర్లను ఉంచితే చర్మం పాడవ్వకుండా ఉంటుంది.
* గంటల కొద్దీ స్నానం చేయకుండా పది నిమిషాల్లో, అదీ వేడివేడి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం ముగించేయాలి. లేకపోతే చర్మంలోని సహజసిద్ధమైన నూనెలని కోల్పోయే అవకాశం ఎక్కువ. ఆ నూనెలు తొలగిపోతే చర్మం పొడిగా మారుతుంది.
* సబ్బు వాడకాన్ని వీలైనంత వరకూ తగ్గించుకోవడం మంచిది. తప్పనిసరై వాడాల్సి వచ్చినా.. తేమ శాతం ఎక్కువ ఉండేవి ఆల్కహాల్, గాఢత లేనివి వాడాలి.
* స్నానం చేసి వచ్చిన వెంటనే శరీరం పూర్తిగా తడారక ముందే కాళ్లూ, చేతులకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలా అయితే తేమ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Chiranjeevi: ఉదారత చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏకంగా రూ.5 లక్షలు ఆర్థికసాయం
-
General News
ED: మద్యం కుంభకోణం మనీలాండరింగ్ కేసు.. ఈడీ ఛార్జిషీట్లో కేజ్రీవాల్, కవిత పేర్లు
-
Crime News
కారు ప్రమాదం.. కళ్లముందే నిండు గర్భిణీ, భర్త సజీవదహనం
-
World News
Mossad: ఇరాన్ క్షిపణి స్థావరంపై మొస్సాద్ సీక్రెట్ ఆపరేషన్..!
-
Politics News
nara lokesh-yuvagalam: కొత్త కంపెనీ వచ్చిందా? ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా?: నారా లోకేశ్
-
Sports News
Hardik: ధోనీ పోషించిన బాధ్యత నాపై ఉంది.. ఒక్కోసారి కాస్త నిదానం తప్పదు: హార్దిక్