వినికిడి ‘మతిమరుపు’

వినికిడిలోపిస్తే చుట్టుపక్కల వాళ్ల మాటలు వినిపించకపోవటమే కాదు..

Published : 13 Mar 2018 01:42 IST

వినికిడి ‘మతిమరుపు’

వినికిడిలోపిస్తే చుట్టుపక్కల వాళ్ల మాటలు వినిపించకపోవటమే కాదు.. డిమెన్షియా వంటి విషయగ్రహణ సమస్యలకూ దారితీస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దీని వెనకగల కారణమేంటో స్పష్టంగా బయటపడలేదు. కానీ వినికిడిలోపించటం వల్ల నలుగురితో మాట్లాడటానికి, కలవటానికి జంకటం వంటివి ఇందుకు దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు. మెదడు ఆరోగ్యానికి నలుగురితో సంబంధాలు కూడా చాలా కీలకం. మాటలు సరిగా వినబడకపోవటం వల్ల మెదడుకు ప్రేరణలు తగ్గిపోయి డిమెన్షియా ముప్పు పెరగటానికి కారణమవుతోంది. కాబట్టి వినికిడిలో ఏదైనా మార్పు కనబడితే వెంటనే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించటం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని