ఇవీ భయాలే..

కొందరికి పాములంటే భయం. కొందరికి బల్లులంటే భయం. మరికొందరు బొద్దింకలను చూసినా వణికిపోతుంటారు. ఇలాంటివి తరచుగా చూసేవే గానీ కొన్ని చిత్ర విచిత్రమైన భయాలు కూడా ఉన్నాయి...

Published : 29 May 2018 01:35 IST

ఇవీ భయాలే..

కొందరికి పాములంటే భయం. కొందరికి బల్లులంటే భయం. మరికొందరు బొద్దింకలను చూసినా వణికిపోతుంటారు. ఇలాంటివి తరచుగా చూసేవే గానీ కొన్ని చిత్ర విచిత్రమైన భయాలు కూడా ఉన్నాయి.* ఎర్గోఫోబియా: ఇది పని భయం. దీని బారినపడ్డవారికి పని అన్నా, పనిచేసే చోటు అన్నా భయం పట్టుకుంటుంది. పని సరిగా చేయలేమేమో, లక్ష్యాలను పూర్తిచేయలేమేమో అనేవి దీనికి దోహదం చేస్తుంటాయి. నలుగురితో కలవటానికి, పది మంది ముందు మాట్లాడటానికి జంకేవారికీ ఇది ఎక్కువే.
* సోమ్నిఫోబియా: దీన్నే హిప్నోఫోబియా అనీ అంటారు. వీళ్లు నిద్ర పడుతుందేమోనని భయపడిపోతుంటారు. తరచుగా పీడకలలు వస్తుండటం, నియంత్రణ కోల్పోవటం వంటివి దీనికి కారణమవుతుంటాయి.
* ఐకోఫోబియా: ఇది ఇంటి భయం. వీళ్లు ఇంట్లో ఉండాలంటే భయపడిపోతుంటారు. ఇంట్లో ఉండే టోస్టర్‌, ఆవెన్‌, ఫ్రిజ్‌, వాషింగ్‌ మిషన్‌, పాత్రలు శుభ్రం చేసే మిషన్ల వంటి వాటిని చూసినా వణికిపోతుంటారు.
* పాన్‌ఫోబియా: ప్రతిదానికీ భయపడిపోవటం దీని ప్రత్యేకత. ఎప్పుడూ ఎవరో తమను భయపెడుతున్నారని, ఎవరో తరుముకొని వస్తున్నారని చెబుతుంటారు. తెగ ఆందోళన పడిపోతుంటారు. శ్వాస సరిగా తీసుకోలేకపోవటం, గుండె లయ తప్పటం వంటి లక్షణాలు కనబడుతుంటాయి.
* అబ్లుటోఫోబియా: ఇదో విచిత్రమైన భయం. వీరికి స్నానం చేయాలంటే భయం. పాత్రలు కడగాలన్నా, బట్టలు ఉతకాలన్నా భయమే. ఇది ఆయా పరిస్థితులు, సందర్భాలను బట్టి మొదలవుతుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని