Diabetic diet: మధుమేహులు ఉదయపు ఆహారంగా ఇవి తీసుకోండి

అల్పాహారం, ఆహారం తీసుకోవడంలొనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.అప్పటి వరకు అలవాటు లేకపోయినా వ్యాయామం చేయడానికి సిద్ధమవుతారు

Published : 27 Feb 2022 17:44 IST

ఇంటర్‌నెట్‌డెస్క్‌: మధుమేహం(diabetes) వచ్చిందంటే చాలు.. సర్వం కోల్పోయిన భావన కలుగుతుంది. ఒక్కసారిగా ఆహారం నుంచి మొదలు దినసరి కార్యక్రమాలను మార్చుకుంటారు. అల్పాహారం, ఆహారం తీసుకోవడంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అప్పటి వరకు అలవాటు లేకపోయినా వ్యాయామం చేయడానికి సిద్ధమవుతారు. మందులతో పాటు ఆహారంలో చాలా జాగ్రత్తలు పాటిస్తుంటారు. ఉదయపు అల్పాహారంలో మార్పులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవి తింటే షుగర్‌ అదుపులోనే..

షుగర్‌ను అదుపులో ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. చక్కని అల్పాహారం తీసుకోవడంతో చక్కెర శాతం అదుపులోనే ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

* ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు, తాజాపండ్లు, ముడిధాన్యాలు ,కొవ్వులేని మాంసం, చేపలు, ఎండు పప్పులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. 

* ఉత్తగా ఇడ్లీ చేసుకునే బదులు అందులో క్యారెట్‌ తురుము, బీట్‌రూట్‌ తురుము వేసుకోవాలి.

* ఏదో ఒక రకం పప్పు కాకుండా కొన్ని రకాల పప్పులను కలుపుకొని వండుకోవాలి.

* మినప వడలకు బదులు కొన్ని రకాల పప్పుతో గారెలను చేసుకోవచ్చు

* చపాతీ, పుల్కా చేసుకుంటే గోధుమ పిండితో కాకుండా రకరకాల పప్పులతో చేసుకుంటే మంచిది.. మార్కెట్లో లభించే మల్టీగ్రెయిన్‌ పిండి బాగుంటుంది. 

* పూరీలకు బదులు చపాతీలతో మెంతికూర వండుకోవడం అవసరం.

* తెల్లని బ్రెడ్‌ కంటే ముడి గోధుమలతో చేసిన బ్రౌన్‌ బ్రెడ్‌ తినొచ్చు. మాంసకృత్తులు అధికంగా ఉండే గుడ్డుతో తీసుకోవాలి.

* బట్టర్‌, వెన్న, నెయ్యి, పామాయిల్‌ లాంటివి కాకుండా సన్‌ఫ్లవర్‌, రైస్‌బ్రాన్‌ అయిల్‌ కలిపిన నూనె వాడాలి.

* కొవ్వు తక్కువగా ఉండే చికెన్‌ తినవచ్చు.

ఇవి వద్దే వద్దు

కొవ్వు అధికంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ఉదయమే కాదు..అసలు భోజనంలోకి రాకుండా చూసుకోవాలి. మసాలాలు, మాంసపు ఫ్రైలు వద్దు. నూనెల్లో వేయించిన వాటిని ముట్టుకోవద్దు. తీపి ఎక్కువగా ఉండే పండ్ల రసాలు తాగొద్దు. తేనె, జామ్‌, తెల్లబ్రెడ్‌, స్వీట్లు తాకొద్దు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని