Pleasant thought: ఆహ్లాద ఊహలతో మంచి ఆలోచనలు
మనమంతా అప్పుడప్పుడూ విచారకర సందర్భాలను ఎదుర్కొంటూనే ఉంటాం. ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతూనే ఉంటాం.
మనమంతా అప్పుడప్పుడూ విచారకర సందర్భాలను ఎదుర్కొంటూనే ఉంటాం. ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతూనే ఉంటాం. యుక్తవయసు పిల్లలకు పదే పదే ఇలాంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఎక్కువ. వాటి గురించే ఆలోచిస్తూ గడుపుతుంటారు. అయితే ఆనందకరమైన సంఘటనలను ఊహించుకుంటే ప్రతికూల ఆలోచనల పరంపర నుంచి బయటపడొచ్చని అమెరికాలోని ఓరేగాన్ స్టేట్ యూనివర్సిటీ అధ్యయనంలో బయటపడింది. కొద్దిసేపు వీటి నుంచి ధ్యాస మళ్లితే స్నేహితులు, తల్లిదండ్రులు, డాక్టర్ సలహా తీసుకోవటానికి అవకాశం చిక్కుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. గతంలో జరిగిన దుర్ఘటనలకు సంబంధించిన ఆలోచనల్లో మునిగినప్పుడు మనసు మరింత విచారంతో నిండిపోతుంది. భావోద్వేగాలను, శరీరాన్ని నియంత్రించుకోవటం కష్టమవుతుంది. ఇలాంటి ఆలోచనల నుంచి బయటపడేసే తేలికైన మార్గాలను గుర్తించటంపై పరిశోధకులు దృష్టి సారించారు. ఆహ్లాదకరమైన సంఘటనలను, ఇష్టమైన వ్యక్తులను ఊహించుకోవటం ఇందుకు బాగా ఉపయోగపడుతున్నట్టు తేలింది. ఇది ప్రతికూల ఆలోచనల నుంచి మనసు మళ్లేలా చేయటమే కాదు, నాడీ వ్యవస్థనూ కుదుట పరుస్తున్నట్టు బయటపడింది. మనసులో ఊహించు కోవటానికి లోతుగా ఆలోచించాల్సి వస్తుంది. ఇందుకు మరింత ఎక్కువ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఫలితంగా బలమైన భావోద్వేగాల ప్రతిస్పందనలు పుట్టుకొస్తాయి. దీంతో ప్రతికూల ఆలోచనల నుంచి మనసు మళ్లటానికి వీలు కల్పిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Yuvraj singh మేమంతా సచిన్ మాటే విన్నాం.. ఆ సలహా బాగా పని చేసింది: యువరాజ్
-
Baby: ‘బేబి’ విజయం.. దర్శకుడికి నిర్మాత బహుమానం.. అదేంటంటే?
-
Postal Jobs: పోస్టల్లో 30,041 ఉద్యోగాలు.. రెండో షార్ట్‌లిస్ట్ ఇదిగో!
-
Janasena: ‘ఎందుకు ఆంధ్రాకు జగన్ వద్దంటే..’: జనసేన పొలిటికల్ కార్టూన్
-
TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్‌బై..!
-
Crime News: ఎన్సీఆర్బీ పేరిట ఫేక్ మెసేజ్.. విద్యార్థి ఆత్మహత్య.. ఇంతకీ ఆ మెసేజ్‌లో ఏముంది?