cholesterol: నీరు తగ్గితే అధిక కొలెస్ట్రాల్‌!

ఎండ అదరగొడుతోంది. విపరీతంగా ఉక్క పోస్తోంది. చెమట రూపంలో నీరంతా బయటకు వెళ్లిపోతోంది. దీన్ని భర్తీ చేయటానికి తగినంత నీరు తాగటం తప్పనిసరి.

Updated : 30 May 2023 12:19 IST

ఎండ అదరగొడుతోంది. విపరీతంగా ఉక్క పోస్తోంది. చెమట రూపంలో నీరంతా బయటకు వెళ్లిపోతోంది. దీన్ని భర్తీ చేయటానికి తగినంత నీరు తాగటం తప్పనిసరి. లేకపోతే ఒంట్లో నీటిశాతం తగ్గుతుంది (డీహైడ్రేషన్‌). ఎక్కువసేపు ఒంట్లో నీరు తగ్గితే కాలేయం, కీళ్లు, కండరాలకు చిక్కులు తలెత్తటమే కాదు.. రక్తంలో మొత్తం కొలెస్ట్రాల్‌, ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ల మోతాదులూ పెరుగుతున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నీటిశాతం తగ్గినప్పుడు కాలేయం రక్తంలోకి మరింత ఎక్కువగా కొలెస్ట్రాల్‌ను విడుదల చేస్తుంది. మరోవైపు రక్తంలోంచి కొలెస్ట్రాల్‌ను తొలగించే ప్రక్రియా మందగిస్తుంది. ఎక్కువగా నీరు తాగేవారిలో చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) తగ్గుతున్నట్టు, మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) పెరుగుతున్నట్టూ కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. నీటికి, కొలెస్ట్రాల్‌ మోతాదులకు మధ్య సంబంధమేంటన్నది కచ్చితంగా తెలియరాలేదు గానీ తగినంత నీరు తాగితే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చనే అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందువల్ల తగినంత నీరు తాగటం మంచిది. ఎండాకాలంలో ఇది మరింత అవసరం. ఇది శరీరానికి శక్తి నివ్వటమే కాకుండా కొలెస్ట్రాల్‌ మోతాదులు తగ్గుముఖం పట్టటానికీ తోడ్పడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని