Health Tip: బాధ... రాసుకుంటే తగ్గుతుందట!

మనసులోని బాధ చెప్పుకొంటే పోతుందంటారు. నోట్‌బుక్‌లో రాసుకున్నా తగ్గుతుంది! ఒత్తిడికి గురిచేస్తున్న పరిస్థితులను, సంఘటనలను..

Updated : 10 Feb 2022 17:39 IST

మనసులోని బాధ చెప్పుకుంటే పోతుందంటారు. అలాగే నోట్‌బుక్‌లో రాసుకున్నా తగ్గుతుంది! ఒత్తిడికి గురిచేస్తున్న పరిస్థితులను, సంఘటనలను.. ఆందోళన, బాధలను రాసుకుంటే మెదడుకు విరామం లభిస్తుంది. ఇది ఏకాగ్రత పెరగటానికి.. పనులను మరింత మెరుగ్గా, త్వరగా పూర్తిచేయటానికి దోహదం చేస్తుందని మిషిగన్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. అదేపనిగా బాధ పడుతుంటే మెదడు విపరీతంగా శ్రమించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కష్టమైన పనులను ముందేసుకుంటే మెదడు మీద ఇంకాస్త భారం పడుతుంది. దీంతో ఏకాగ్రత కుదరక నైపుణ్యమూ తగ్గుతుంది. మనసులోని భావాలను రాసుకోవటం వల్ల మెదడు మీద భారం తగ్గి హుషారుగా పనిచేస్తుంది. బాధలు తగ్గితే మున్ముందు ఎదురయ్యే ఒత్తిళ్లనూ తట్టుకునేలా మెదడు సిద్ధమవుతుంది. కాబట్టి అదేపనిగా విచారిస్తుంటే మనసులోని భావాలకు అక్షర రూపం ఇవ్వండి. మెదడు, మనసు తేలికపడతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు