తాజా శ్వాసకు ప్రొబయాటిక్స్‌

నోటి దుర్వాసన చిన్న సమస్యే గానీ మనుషుల మధ్య సాన్నిహిత్యాన్ని దెబ్బతీస్తుంది. దీన్ని తగ్గించుకోవటానికి మౌత్‌వాష్‌లతో పుక్కిలించటం, చూయింగ్‌ గమ్‌ నమలటం వంటి చిట్కాలు ఉపయోగపడతాయి.

Published : 27 Dec 2022 00:10 IST

నోటి దుర్వాసన చిన్న సమస్యే గానీ మనుషుల మధ్య సాన్నిహిత్యాన్ని దెబ్బతీస్తుంది. దీన్ని తగ్గించుకోవటానికి మౌత్‌వాష్‌లతో పుక్కిలించటం, చూయింగ్‌ గమ్‌ నమలటం వంటి చిట్కాలు ఉపయోగపడతాయి. దీనికి మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే ప్రొబయాటిక్స్‌ ప్రత్యామ్నాయ చికిత్సగా ఉపయోగపడగలదని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వీసెలా సైబరియా బ్యాక్టీరియా జాతులకు చెందిన ప్రొబయాటిక్‌ దంతాలు క్షీణించటానికి, నోటి దుర్వాసనకు కారణమయ్యే స్ట్రెప్టోకాకస్‌ మ్యుటాన్స్‌ అనే బ్యాక్టీరియాను వృద్ధి చెందకుండా నిలువరిస్తున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. హానికారక బ్యాక్టీరియా ఒక పొరలా ఏర్పడటాన్నీ ఇది అడ్డుకోవటం గమనార్హం. ఇలా పొర మాదిరిగా ఏర్పడటం ద్వారానే బ్యాక్టీరియా తనను కాపాడుకోవటానికి  ప్రయత్నిస్తుంది మరి. వీసెలా సైబరియాతో కూడిన మౌత్‌వాష్‌ మూలంగా దంతాల క్షీణతను తెలిపే స్కోరు 20.7% తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. స్ట్రెప్టోకాకస్‌ సాలివరియస్‌ కే12 అనే ప్రొబయాటిక్‌ సైతం మంచి ప్రభావం చూపుతున్నట్టు తేలింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని