వయసు తక్కువని భావిస్తే ఆయుష్షు!

మీ వయసెంతని అడిగితే చాలామంది ఒకట్రెండు సంవత్సరాలు తక్కువగానే చెబుతుంటారు. ఇలా ఎందుకు చెబుతారో తెలియదు గానీ నిజంగానే ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు పరిశోధకులు. అసలు వయసు కన్నా తక్కువ వయసుతో ఉన్నట్టు భావించే వృద్ధులు కాస్త ఎక్కువ కాలం

Published : 14 Jul 2021 22:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీ వయసెంతని అడిగితే చాలామంది ఒకట్రెండు సంవత్సరాలు తక్కువగానే చెబుతుంటారు. ఇలా ఎందుకు చెబుతారో తెలియదు గానీ నిజంగానే ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు పరిశోధకులు. అసలు వయసు కన్నా తక్కువ వయసుతో ఉన్నట్టు భావించే వృద్ధులు కాస్త ఎక్కువ కాలం జీవిస్తుండటమే దీనికి కారణం. తాము భావించే వయసుకూ క్యాన్సర్‌ మరణాలకు సంబంధం కనబడటం లేదు గానీ గుండెజబ్బు మరణాలతో బలమైన సంబంధం ఉంటుండటం గమనార్హం. తక్కువ వయసుతో ఉన్నట్టు భావించటం మరింత మంచి అలవాట్లకు దారితీస్తుండొచ్చన్నది పరిశోధకుల మాట. అసలు వయసు కన్నా తక్కువ లేదా ఎక్కువ వయసుతో ఉన్నట్టు భావించటం ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నట్టు కనబడుతోందని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన డాక్టర్‌ రోనాల్డ్‌ డి.సీగెల్‌ చెబుతున్నారు. 

మానసికంగా తక్కువ వయసుతో ఉన్నట్టు భావించటం రకరకాలుగా మెరుగైన ఆరోగ్యానికి దారితీయొచ్చు. వీటిల్లో ఒకటి వ్యాయామం. ఎక్కువ వయసుతో ఉన్నామని అనుకునేవారు చిన్నపాటి శారీరక శ్రమ, వ్యాయామాలు, ఆటలను కూడా చాలా కష్టమైనవని భావిస్తుంటారు. తమ చేతకాదని వెనకడుగు వేస్తుంటారు. అదే వయసు తక్కువని భావించేవారు కష్టపడకపోతే ఫలితం లేదని అనుకొని ముందడుగు వేస్తారు. అలాగే వయసు మీరిందని అనుకునేవారు ఆహారం విషయంలోనూ అశ్రద్ధ చూపిస్తారు.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని