Dementia: వ్యాయామంతో జ్ఞాపకశక్తి

అధిక రక్తపోటు గలవారికి డిమెన్షియాతో పాటు విషయ గ్రహణ లోపం తలెత్తే ముప్పు ఎక్కువ. డిమెన్షియాలో జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యం తగ్గుతాయి. ఇవి రోజువారీ వ్యవహారాల్లో బాగా ఇబ్బంది కలిగిస్తాయి.

Published : 18 Jun 2024 00:06 IST

ధిక రక్తపోటు గలవారికి డిమెన్షియాతో పాటు విషయ గ్రహణ లోపం తలెత్తే ముప్పు ఎక్కువ. డిమెన్షియాలో జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యం తగ్గుతాయి. ఇవి రోజువారీ వ్యవహారాల్లో బాగా ఇబ్బంది కలిగిస్తాయి. అయితే అధిక రక్తపోటు గల వృద్ధులు శారీరకశ్రమ, వ్యాయామంతో దీని ముప్పును తగ్గించుకోవచ్చని అమెరికాలోని వేక్‌ ఫారెస్ట్‌ యూనివర్సిటీ అధ్యయనం సూచిస్తోంది. వారానికి కనీసం ఒకసారైనా ఒంటికి చెమట పట్టించే.. గుండె, శ్వాస వేగం పెంచే వ్యాయామాలు చేసేవారికి విషయగ్రహణ లోపం, మతిమరుపు వచ్చే అవకాశం తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుతం చాలామంది వృద్ధులు వ్యాయామం చేస్తున్న నేపథ్యంలో ఇది మంచి కబురేనని చెప్పుకోవచ్చు. వ్యాయామంతో ఇలాంటి ప్రయోజనాలు కనిపిస్తున్నట్టు తెలిస్తే కాస్త కఠినమైన వ్యాయామాలు చేయటానికి మరింత ఉత్సాహం చూపుతారనీ పరిశోధకులు భావిస్తున్నారు. అయితే 75 ఏళ్లు లోపువారిలోనే తీవ్రమైన వ్యాయామాలతో ఈ ప్రయోజనాలు కనిపిస్తుండటం గమనార్హం.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని