Heart Failure: గుండె వైఫల్యంలో ఊబకాయ రక్షణ నిజం కాదు!
అధిక బరువు, ఊబకాయంతో గుండె విఫలమయ్యే అవకాశం పెరగటం నిజమే. కానీ గుండె విఫలమైన తర్వాత ఊబకాయుల్లో జబ్బు త్వరగా ముదరదని భావిస్తుంటారు.
అధిక బరువు, ఊబకాయంతో గుండె విఫలమయ్యే అవకాశం పెరగటం నిజమే. కానీ గుండె విఫలమైన తర్వాత ఊబకాయుల్లో జబ్బు త్వరగా ముదరదని భావిస్తుంటారు. గుండె వైఫల్యంలో పంపింగ్ సామర్థ్యం తగ్గుతుంది. గుండె ప్రధాన గది సరిగా సంకోచించదు. దీంతో అవసరమైనంత రక్తాన్ని పంప్ చేయలేదు. దీంతో దీర్ఘకాలంగా, అలాగే తీవ్ర గుండె వైఫల్యంతో బాధపడేవారు బరువు తగ్గిపోతుంటారు. ఇది మరిన్ని గుండె సమస్యలకు దారితీస్తుంది. మరణించే అవకాశమూ పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే వీరికి ఊబకాయం కొంతవరకు రక్షణ కల్పిస్తుందని.. బక్క పలుచగా ఉన్నవారితో పోలిస్తే వీరికి ఆసుపత్రిలో చేరటం, మరణించే ముప్పు తక్కువని అనుకుంటుంటారు. అయితే ఇది నిజం కాదని, ఊబకాయంతో మంచి కన్నా చెడే ఎక్కువని యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటోంది. గుండె ఒత్తిడికి గురైనప్పుడు రక్తంలోకి న్యాట్రియూరెటిక్ పెప్టైడ్లనే హార్మోన్లు విడుదలవుతుంటాయి. గుండె వైఫల్యం గలవారిలో వీటి మోతాదులు ఎక్కువగా ఉంటాయి. జబ్బు ముదురుతున్న తీరును గుర్తించటానికివి తోడ్పడతాయి. సాధారణంగా ఊబకాయాన్ని గుర్తించటానికి ఎత్తు, బరువుల నిష్పత్తిని (బీఎంఐ) పరిగణలోకి తీసుకుంటుంటారు. బీఎంఐ 25, అంతకన్నా ఎక్కువ గలవారిలో మరణాలు తక్కువగా ఉంటున్నప్పటికీ.. నడుం-ఎత్తు నిష్పత్తి, న్యాట్రియూరెటిక్ పెప్టైడ్ల వంటి ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకొని చూస్తే అలాంటి ప్రయోజనమేమీ కనిపించలేదు. ఒంట్లో కొవ్వు మోతాదు ఎక్కువగా ఉంటే ఆసుపత్రిలో చేరటం, మరణించే ముప్పు ఎక్కువగానే ఉంటున్నట్టు బయటపడింది. నడుం-ఎత్తు నిష్పత్తిని పరిగణనలోకి తీసుకొని చూస్తే ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపించింది. బీఎంఐలో కొవ్వు, కండరాలు, ఎముకల మోతాదులు.. ఒంట్లో కొవ్వు ఎక్కడెక్కడ విస్తరించిందనేది తెలియదు. అందుకే నడుం-ఎత్తు నిష్పత్తిని పరిశీలిస్తుంటారు. గుండె విఫలమైనవారిలోనూ దీన్నే పరిగణనలోకి తీసుకోవటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. గుండె విఫలమైనవారు బరువు తగ్గితే మేలు కలుగుతుందా? అనే ప్రశ్నకూ తాజా అధ్యయనం తావిచ్చింది. దీన్ని తెలుసుకోవటానికి ప్రయోగ పరీక్షలు చేయాల్సి ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Tovino Thomas: ‘ది కేరళ స్టోరీ’ స్థానంలో ‘2018’కి ఆస్కార్ ఎంట్రీ?’.. టొవినో రియాక్షన్ ఏంటంటే?
-
Tirumala: ఘాట్‌రోడ్డులో ద్విచక్రవాహనాల రాకపోకలపై ఆంక్షలు సడలించిన తితిదే
-
Pakistan: పాక్‌లో మరోసారి పేలుళ్లు.. పలువురి మృతి
-
Kumari Srimathi Review: రివ్యూ: కుమారి శ్రీమతి.. నిత్యామేనన్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
-
JioFiber: జియో ఫైబర్ ఆఫర్.. 30 రోజులు ఉచిత సర్వీస్
-
Girlfriend effect: కొత్త ట్రెండ్.. #గర్ల్‌ఫ్రెండ్ ఎఫెక్ట్.. ఇంతకీ ఏమిటిది?