Cancer vaccine: త్వరలో క్యాన్సర్ టీకా!
క్యాన్సర్ టీకా చికిత్స ఎదురు చూపులకు త్వరలోనే తెరపడనుందా? క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు రూపొందించిన సమర్థ మార్గం ఇలాంటి ఆశలే రేకెత్తిస్తోంది. దీనిలోని కీలకాంశం- కణితులను గుర్తించే, తుదముట్టించే తీరును రోగనిరోధకశక్తికి నేర్పించటం. నిజానిది ఫ్లూ, పోలియో వంటి టీకాల మాదిరిగా జబ్బును నివారించదు గానీ క్యాన్సర్ తిరగబెట్టకుండా కాపాడుతుంది. కణితి కణాల్లోని ప్రొటీన్లను ప్రమాదకరమైనవని గుర్తించేలా రోగనిరోధక శక్తికి తర్ఫీదు ఇస్తుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇమ్యూనో థెరపీ ప్రభావాన్ని మరింత పెంచుతుందనీ ఆశిస్తున్నారు. రోగనిరోధక చికిత్సను ఎంఆర్‌ఎన్‌ఏ టీకాతో కలిపి ఇవ్వగా.. చర్మ క్యాన్సర్ తిరగబెట్టే ముప్పు, దీంతో మరణించే అవకాశం 44% వరకు తగ్గుతున్నట్టు బయటపడింది. అందుకే ఇది చాలా ఉత్సుకతను రేకెత్తిస్తోంది. ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారిత క్యాన్సర్ టీకా సామర్థ్యం ఓ చిన్నపాటి అధ్యయనంలో బయట పడటం ఇదే తొలిసారి. పెద్ద పరిశోధనల్లోనూ మంచి ఫలితం కనిపిస్తే క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు రాగలవని భావిస్తున్నారు. అయితే ఈ టీకాను విస్తృతంగా, చవకగా అందుబాటులోకి తేవటానికి చేయాల్సింది చాలానే ఉంది. ఆయా వ్యక్తుల కణితుల్లోని జన్యువులకు అనుగుణంగా దీన్ని రూపొందించాల్సి ఉంటుంది కూడా.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC: ప్రశ్నపత్రం లీకేజీ.. రేణుక బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన నాంపల్లి కోర్టు
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
GHMC: అగ్నిమాపక నిబంధనలు పాటించని మాల్స్, ఆసుపత్రులను సీజ్ చేస్తాం: జీహెచ్ఎంసీ
-
World News
US Man: అతడికి డబ్బు ఖర్చుపెట్టడమంటే అలర్జీ అట..!
-
Sports News
PBKS vs KKR: మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. కోల్‌కతాపై పంజాబ్ విజయం..
-
World News
Pope Francis: నేను ఆరోగ్యంగా ఉన్నా: పోప్ ఫ్రాన్సిస్