ఊపిరితిత్తి క్యాన్సర్‌పై అపోహలొద్దు
ఊపిరితిత్తి క్యాన్సర్‌కు ప్రధాన ముప్పు కారకం పొగతాగే అలవాటు. దీని బారిన పడుతున్నవారిలో 85% మందికి ఇదే కారణమవుతోంది.
ఊపిరితిత్తి క్యాన్సర్‌కు ప్రధాన ముప్పు కారకం పొగతాగే అలవాటు. దీని బారిన పడుతున్నవారిలో 85% మందికి ఇదే కారణమవుతోంది. సిగరెట్లు, చుట్టలు, బీడీలను తాగటమే కాదు.. వీటి నుంచి వెలువడే పొగను పక్కవాళ్లు పీల్చినా ప్రమాదమే. పొగతాగే అలవాటు గలవారితో జీవించేవారికి 20% నుంచి 30% వరకు ఊపిరితిత్తి క్యాన్సర్ వచ్చే అవకాశముంది. అయినప్పటికీ పొగ అలవాటు-ఊపిరితిత్తి క్యాన్సర్ మీద ఇప్పటికీ ఎన్నో అపోహలు నెలకొన్నాయి. ఇప్పటికే ఆలస్యమైపోయిందని అనుకునేవారు కొందరైతే.. లైట్ సిగరెట్లతో ముప్పేమీ లేదని అనుకునేవారు కొందరు. ఇలాంటి అపోహలను తొలగించుకోవటం మంచిది. ఒక్క పొగ అలవాటే కాదు, ఇతరత్రా కారకాలూ ఊపిరితిత్తి క్యాన్సర్‌కు దోహదం చేయొచ్చు. కాబట్టి దీనిపై అవగాహన కలిగుండటం ఎంతైనా అవసరం.
ఇప్పటికే ఆలస్యమైపోయినా..
‘పొగ తాగే అలవాటు చాలా ఏళ్లుగా ఉంది. ఇప్పుడు మానేస్తే ఉపయోగమేముంది?’ అనుకోవద్దు. పొగ మానేసిన క్షణం నుంచే దాని ప్రయోజనాలు మొదలవుతాయి. రక్త ప్రసరణ, ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. క్రమంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పూ తగ్గుతూ వస్తుంది. పొగ తాగటం అలాగే కొనసాగించినవారితో పోలిస్తే.. పదేళ్ల క్రితం పొగ మానేసినవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం దాదాపు సగానికి పడిపోతుంది.
* అప్పటికే ఊపిరితిత్తి క్యాన్సర్ ఉన్నవారు పొగ మానేసినా మంచి ఫలితం కనిపిస్తుంది. వీరికి క్యాన్సర్ చికిత్సలు సమర్థంగా పనిచేస్తాయి. దుష్ప్రభావాలు సైతం తక్కువగా ఉంటాయి. శస్త్రచికిత్స చేయించుకున్నవారిలో పొగతాగే వారితో పోలిస్తే మానేసినవారు త్వరగా కోలుకుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. స్వరపేటిక క్యాన్సర్‌కు రేడియోథెరపీ అవసరమైనవారిలో పొగ మానేసినవారికి గొంతు బొంగరుపోయే అవకాశం తక్కువ. కొందరిలో రెండోసారి క్యాన్సర్ వచ్చే ముప్పూ తగ్గుముఖం పడుతుంది.
తక్కువ తారు, ‘లైట్’ సిగరెట్లయినా..
మామూలు సిగరెట్ల మాదిరిగానే ఇవీ ప్రమాదకరమైనవే. మెంథాల్‌తో విషయంలో అప్రమత్తత అవసరం. దీంతో కూడిన సిగరెట్లు మరింత ప్రమాదకరమని, వీటిని మానటం కష్టమని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మెంథాల్‌తో కలిగే చల్లటి భావన ఇంకాస్త ఎక్కువగా పొగను పీల్చుకునేలా ప్రేరేపిస్తుంది.
యాంటీఆక్సిడెంట్ మాత్రలు రక్షించలేవు
యాంటీఆక్సిడెంట్ మాత్రలు వేసుకుంటే పొగ తాగటం వల్ల తలెత్తే దుష్రభావాలు తగ్గుతాయని అనుకోవటానికి లేదు. ఊపిరితిత్తి క్యాన్సర్ నుంచి కాపాడటంలో వీటి ప్రభావం మీద చేసిన అధ్యయనంలో విపరీత ఫలితాలు వెల్లడయ్యాయి. పొగతాగే అలవాటు ఉండి, బీటా కెరొటిన్ తీసుకున్నవారిలో అనూహ్యంగా ఊపిరితిత్తి క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. అందువల్ల యాంటీఆక్సిడెంట్ మాత్రలను వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవటం మంచిది. అయితే పండ్లు, కూరగాయల నుంచి లభించే యాంటీఆక్సిడెంట్లు మేలు చేస్తాయనే విషయం మరవరాదు.
పైపులు, చుట్టలతోనూ ప్రమాదమే..
కొందరు పైపులు, చుట్టలతో అంత ప్రమాదముండని భావిస్తుంటారు. ఇది నిజం కాదు. సిగరెట్ల మాదిరిగానే ఇవీ నోరు, గొంతు, అన్నవాహిక, ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పును పెంచుతాయి. ప్రత్యేకించి చుట్టలతో గుండె జబ్బు, ఊపిరితిత్తి జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ.
ఒక్క పొగ తాగటమే కాదు..
ఊపిరితిత్తి క్యాన్సర్‌కు పొగతాగే అలవాటు ముఖ్యమైన కారణమైనప్పటికీ ఇతరత్రా కారకాలూ లేకపోలేదు. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాడాన్ అనే వాసనలేని రేడియోయాక్టివ్ వాయువు గురించే. రాళ్లు, మట్టి పగుళ్ల నుంచి బయటకు వచ్చే ఇది ఇళ్లలోకి, భవనాల్లోకి వ్యాపించొచ్చు. రాడాన్‌ను పరీక్ష ద్వారా గుర్తించొచ్చు. కాకపోతే ఇది అన్నిచోట్లా అందుబాటులో లేదు.
* గాలి కాలుష్యమూ ఊపిరితిత్తి క్యాన్సర్‌కు దారితీయొచ్చు. స్వచ్ఛమైన వాతావరణంలో జీవించేవారితో పోలిస్తే వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించేవారికి ఊపిరితిత్తి క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో పట్ణణాలు, నగరాల్లో గాలి కాలుష్యం బాగా పెరిగిపోతోంది. కొన్నిచోట్ల ప్రమాదకర స్థాయులనూ మించిపోతోంది. ఇది క్యాన్సర్‌కు మాత్రమే కాదు.. ఇతరత్రా శ్వాసకోశ సమస్యలకూ దారితీస్తుంది.కాబట్టి జాగ్రత్త అవసరం.
టాల్కమ్ పౌడర్ కారణం కాదు
ముఖానికి రాసుకునే టాల్కమ్ పౌడర్‌ను పొరపాటున పీల్చుకుంటే ఊపిరితిత్తి క్యాన్సర్ వస్తుందని కొందరు భయపడుతుంటారు. ఇది నిజం కాదని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఆస్‌బెస్టాస్, వినైల్ క్లోరైడ్ వంటి రసాయనాలతో పనిచేసేవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది.
వ్యాయామంతో మేలు
క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి ఊపిరితిత్తి క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. ఆరుబయట వ్యాయామం చేయటం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది కూడా. రక్తంలో ఆక్సిజన్ మోతాదులూ పుంజుకుంటాయి. గుండెజబ్బు, పక్షవాతం వంటి తీవ్ర సమస్యల బారినపడటమూ తగ్గుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
Ap-top-news News
Kurnool: ఎల్లమ్మా.. నీ వెండి బంగారాలు ఏవమ్మా?
-
Politics News
TDP-Mahanadu: ‘బహిరంగ సభకు అడుగడుగునా అడ్డంకులే’
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Politics News
రూ.2కే కిలో బియ్యం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆరే: పేర్ని నాని
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్