Health Tips: రోజూ వాడే వీటిని.. త్వరగా వదిలించుకుంటే మంచిది!

అనారోగ్యానికి దారితీసే పాతవాటిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. రోజువారీ వాడుకునే వస్తువుల విషయంలోనూ...

Updated : 11 Sep 2022 17:32 IST

అనారోగ్యానికి దారితీసే పాతవాటిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. రోజువారీ వాడుకునే వస్తువుల విషయంలోనూ ఇది తప్పనిసరి. అలాంటి కొన్నింటి గురించి తెలుసుకుందాం.

పాత్రలు తోమే స్పాంజి: తడిగా ఉండే స్పాంజిలో బ్యాక్టీరియా త్వరత్వరగా వృద్ధి చెందుతుంది. అవి అక్కడ్నుంచి మన చేతులకు, ఆహార పదార్థాలకూ వ్యాపిస్తాయి. చేతికి గాట్లుంటే ఒంట్లోకీ ప్రవేశిస్తాయి. వేడి నీటితో శుభ్రం చేసినప్పటికీ పాత్రలను తోమే స్పాంజిలను వారానికి ఒకసారైనా మార్చేయాలి.

దిండ్లు: తలకు పోసే చెమట, నూనె, చర్మ కణాలన్నీ దిండ్లకు అంటుకుంటాయి. అందువల్ల కవర్లను తరచూ శుభ్రం చేయటమే కాదు, ప్రతి రెండేళ్లకు దిండ్లనూ మార్చుకోవాలి. దిండు ఆకారం దెబ్బతింటే ఇంకా ముందుగానే కొత్తవి తీసుకోవాలి.

బ్రష్‌: బ్రష్‌ పోచలు వంగిపోతే చిగుళ్లకు హాని చేయొచ్ఛు కాబట్టి ప్రతి 3-4 నెలలకు బ్రష్‌ను మార్చేయటం ఉత్తమం. అంతకుముందే పోచలు వంగిపోతే వెంటనే కొత్తది వాడుకోవాలి.

నాన్‌స్టిక్‌ పాత్రలు: పాలీటెట్రాఫ్లోరోఇథిలీన్‌ (టెఫ్లాన్‌) పొరతో కూడిన నాన్‌స్టిక్‌ పాత్రల మీద గాట్లు పడినా, పెచ్చులు ఊడినా వెంటనే మూలకు వేయటం మంచిది. టెఫ్లాన్‌ పెచ్చులు వంటకాల్లో కలిసినా ఆరోగ్యానికి పెద్దగా హాని చేయకపోవచ్చు గానీ పాతవి పక్కనపెట్టటమే మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని