Joint Pains: కీళ్లనొప్పులు బాధిస్తున్నాయా?!
యాభయ్యోపడిలోకి వస్తే చాలు... మోకాళ్లనొప్పులని(knee pain) ఒకరూ మడమల నొప్పులనీ ఇంకొకరూ వేళ్లనొప్పులనీ మరొకరూ... ఇలా ఎవరో ఒకరు ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. ఇక, డెబ్భైలకొస్తే... కూర్చుంటే లేవలేక లేస్తే కూర్చోలేనంత కీళ్లనొప్పుల(joint pain)తో బాధపడేవాళ్లు కోకొల్లలు. అందుకే ఆర్థ్రయిటిస్, రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్‌లతో దీర్ఘకాలికంగా బాధపడేవాళ్లకి చక్కని చికిత్సని అందిస్తోంది ‘సుఖీభవ వెల్‌నెస్ సెంటర్’
శరీరావయవాలైన కాళ్లూ చేతులూ పాదాల్లోని ఎముకల్ని మృదులాస్థి కణజాలంతో నిర్మితమైన కీళ్లు(joints) కలిపి ఉంచుతాయి. వయసు పెరిగేకొద్దీ ఈ కీళ్లలోని కణజాలం తగ్గిపోయి పలచబారిపోవడం లేదా కణాల్లో వాపు రావడం జరుగుతుంటుంది. ఫలితంగా కూర్చున్నా లేచినా కీళ్ల దగ్గర నొప్పి వస్తుంటుంది. దీన్నే వాడుక భాషలో కీళ్లు అరిగిపోయాయని అంటే, వైద్య పరిభాషలో ఆర్థ్రయిటిస్(Arthritis treatment)గా పిలుస్తుంటారు. అయితే ఇది ప్రధానంగా ఆస్టియో ఆర్థ్రయిటిస్, రుమటాయిడ్ ఆర్ధ్రయిటిస్ అని రెండు రకాలు. మొదటిదాంట్లో మృదులాస్థి కణజాలం అరగడం వల్ల ఎముకలు రాపిడికి గురయి నొప్పి పుడుతుంటాయి. అదే రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్‌లో రోగనిరోధకశక్తి ఎదురు తిరగడంవల్ల కీళ్ల దగ్గరున్న కణాలన్నీ ఇన్‌ఫ్లమేషన్‌కి గురై వాచిపోతాయి. దాంతో నొప్పి తీవ్రంగా ఉంటుంది. చేతులూ వేళ్లూ మణికట్టూ కాళ్లూ... ఇలా కీళ్ల భాగాలతోపాటు శరీరంలోని ఇతర కణజాలాలూ కండరాలమీదా దీని ప్రభావం ఉంటుంది. దాంతో పిత్తాశయం, ఊపిరితిత్తుల సమస్యలతోపాటు రక్తహీనత, లో బీ1, మలబద్ధకం, కొలైటిస్... వంటి అనేక రుగ్మతలు కూడా తలెత్తుతాయి. ఈ రెండూ కాకుండా ఇన్ఫెక్షన్ల కారణంగా సొరియాటిక్, సెప్టిక్, థంబ్... వంటి ఇతరత్రా ఆర్థ్రయిటిస్ వ్యాధులూ వస్తుంటాయి. వంశపారంపర్యంగాగానీ, ఆటలు ఆడేటప్పుడు తగిలిన గాయాలవల్లో, ఊబకాయం కారణంగా కీళ్లమీద బరువు ఎక్కువ పడటం, పోషకాహార లోపం, శారీరక శ్రమ, కాల్షియంలోపం, నిద్రలేమి, జీవక్రియాలోపాలు, ఒత్తిడి, డిప్రెషన్...ఇలా అనేక కారణాల వల్ల ఆర్థ్రయిటిస్ సమస్యలు వస్తుంటాయి. అందుకే చికిత్స చేయడానికి ముందు అది రావడానికి గల కారణాన్ని గుర్తించి దానికి సరైన చికిత్స(joint pain treatment) అందిస్తోంది సుఖీభవ.
చికిత్స ఎలా ఉంటుందంటే...
మృదులాస్థి అరిగిపోవడంవల్ల తలెత్తే ఆస్టియో ఆర్థ్రయిటిస్‌ని నిర్లక్ష్యం చేస్తే రాపిడి వల్ల క్రమంగా ఎముకలూ దెబ్బతినవచ్చు. రుమటాయిడ్‌లో అయితే మొదట్లో కీళ్లను చుట్టి ఉండే పొరమీద మాత్రమే ప్రభావం ఉంటుంది. తరవాత అది కీళ్ల దగ్గరున్న మృదులాస్థి కణజాలంతోపాటు శరీరంలోని ఇతర కణజాలాల్నీ దెబ్బతీయడంతో మంచినీళ్ల గ్లాసును సైతం పట్టుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి కాస్త కీళ్లు పట్టేస్తున్నాయి అనిపించిన ప్రారంభ దశలోనే చికిత్స తీసుకోవాలి. ఆర్థ్రయిటిస్ సమస్యలున్నవాళ్లు కొన్ని ఆహారనియమాల్ని పాటించాలి. ఆల్కహాల్, మసాలాలు, ఎక్కువ ఉప్పు, పులుపూ తీపీ పదార్థాల్లాంటి వాటికి దూరంగా ఉండాలి. మనిషి శరీరతత్త్వాన్ని బట్టి బార్లీ, మజ్జిగ, ఓట్స్, పెసలు, సోయా, బెర్రీలు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలనేది సూచిస్తాం. ఆహారంతోపాటు ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం అన్నీ కలిపి చికిత్స చేయడం ద్వారా నివారించాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా ఆహారాన్ని సూచించడం ద్వారా అరిగిపోయిన కార్టిలేజ్ పునరుత్పత్తి అయ్యేలా చేస్తాం. ఆ సమయంలోనే కొన్ని రకాల యోగాసనాలతోపాటు పంచకర్మ, కాయకల్ప చికిత్సల్లో భాగంగా చేసే మర్దనల వల్ల మృదులాస్థి కణజాలం మరింత దెబ్బతినకుండా ఉంటుంది.
రోగనిరోధకశక్తి ఎదురు తిరగడంవల్ల వచ్చే రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్‌లో కీళ్లవాపులూ నొప్పులూ తగ్గడానికి అక్వాటిక్ యోగా, తైచి వంటివి చేయిస్తాం. ప్రతికూల రోగనిరోధకశక్తిని నియంత్రించడానికి కొన్ని మూలికలతో చేసిన మందుల్నీ వాడాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి ప్రకృతి వైద్య విధానాలైన అభ్యంగనం, ఉద్వర్తనం, డీప్ టిష్యూ మసాజ్, రిఫ్లెక్సాలజీ... వంటి వాటినీ చేస్తాం. కాపర్, ఇనుము, వెండి పాత్రల్లో ఒక రకమైన సాంబ్రాణి, వెల్లుల్లి, అల్లం, ఆముదం, అశ్వగంధ... వంటి పదార్థాలతో చేసిన భస్మాలను ఇస్తాం. కొన్ని ప్రత్యేక మూలికలతో చేసిన తైలాలను వాడటంవల్ల రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్‌ను తగ్గించేందుకు ప్రయత్నిస్తాం. ముఖ్యంగా శరీరంలో టాక్సిన్లు పేరుకుపోవడం వల్ల కూడా రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటిని తొలగించేందుకు మందులు ఇస్తాం. ఆపై రోగ తీవ్రతను బట్టి ఆహారంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. వెల్లుల్లి వేసిన మజ్జిగ, తేనె రోగ నివారణకు తోడ్పడతాయి.
టీ, కాఫీలకు బదులు శొంఠిగానీ పసుపుగానీ వేసి మరిగించిన పాలు ఉదయం, సాయంత్రం తాగితే మంచిది. రాగులు, గోధుమలు, ఉలవలు... తదితర ముడిధాన్యాల్లోని పీచు మేలుచేస్తుంది. మునగ, క్యారెట్, కాకర, క్యాబేజీ, బొప్పాయి వంటివి తీసుకుంటే కీళ్లవాపు తగ్గుతుంది. రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్‌తో బాధపడేవాళ్లకి కూడా తేలికపాటి వ్యాయామం తప్పనిసరి. ప్రాణాయామం వల్ల కీళ్లలో సాగే గుణం పెరుగుతుంది. వ్యాధి ఏదయినాగానీ దాని తీవ్రతనీ వెనకున్న కారణాన్నీ గుర్తించి సలహాసూచనలు ఇస్తుంది సుఖీభవ. కాబట్టి కీళ్లనొప్పుల్ని నిర్లక్ష్యం చేయకుండా ముందే సరైన చికిత్స తీసుకుంటే వృద్ధాప్యాన్ని చలాకీగా గడిపేయొచ్చు.
ఇవీ చదవండి
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
RJD: అవును మోదీజీ.. మీరు చెప్పింది నిజమే..ఇప్పుడదే చేశాం..!
-
World News
China: తైవాన్‌పై అవసరమైతే బలప్రయోగం తప్పదు..!
-
India News
Nitish Kumar: ఎనిమిదో సారి.. సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారం
-
Politics News
Kavitha Kalvakuntla: అక్కడ మా ఎమ్మెల్యే లేకపోయినా అభివృద్ధి ఆగలేదు: ఎమ్మెల్సీ కవిత
-
Movies News
Poorna: పెళ్లి క్యాన్సిల్ వార్తలపై పూర్ణ ఏమన్నారంటే..!
-
India News
Kashmir: స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల వేళ.. భారీ ఉగ్రకుట్ర భగ్నం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. దయచేసి ఎవరూ ఫాలో కాకండి: నాగచైతన్య
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..