Drinking water: బరువు తగ్గాలనుకుంటున్నారా?
ఇంటర్నెట్‌డెస్క్: దాహం వేసినపుడు కొందరు నీళ్లకు బదులు కూల్డ్రింకులు, పళ్ల రసాలు, కాఫీ, టీ వంటివి తాగేస్తుంటారు. వీటితో అప్పటికి దాహం తీరొచ్చేమో గానీ చాలా దుష్ప్రభావాలు పొంచి ఉంటాయి. చక్కెరను కలిపి తయారుచేస్తారు కాబట్టి ఇవి బరువు పెరగటానికివి దోహదం చేస్తాయి. అందుకే దాహం వేసినపుడు మామూలు నీళ్లు తాగటమే మంచిదన్నది నిపుణుల సూచన. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో పాల్గొన్న కొందరి ఆహార అలవాట్లను పరిశోధకులు ఇటీవల విశ్లేషించారు.
వీరంతా సగటున రోజుకు 4.2 కప్పుల నీళ్లు, 2,157 కేలరీలను తీసుకుంటున్నట్టు గుర్తించారు. అయితే నీళ్లు ఎక్కువగా తాగినవారు మాత్రం కేలరీలు, తీపి పానీయాలు, కొవ్వు పదార్థాలు, చక్కెర, ఉప్పు తక్కువగా తీసుకోవటం గమనార్హం. రోజుకు 1-3 కప్పులు ఎక్కువగా నీళ్లు తాగినా 68 నుంచి 205 వరకు కేలరీలు తగ్గుతున్నట్టు బయట పడింది. అందువల్ల బరువు తగ్గాలని అనుకునేవారు తగినన్ని నీళ్లు తాగాలని, వీలైతే కాస్త ఎక్కువగా తీసుకోవటమూ మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల ఈసారి దాహం వేసినపుడు శీతల పానీయల జోలికి వెళ్లకుండా మామూలు నీళ్లే తాగండి. దీంతో దాహం తీరటంతో పాటు బరువూ అదుపులో ఉంటుంది.
ఇక దాహం వేస్తే గానీ నీళ్ల గురించి ఆలోచించం. నిజానికి దాహం వేయటానికి ముందుగానే.. మన ఒంట్లో నీటి శాతం తగ్గిపోతుంది. పరిస్థితి ఇంతవరకు రాకుండా తరచుగా నీళ్లు తాగటం మంచిది. కానీ మనలో చాలామంది.. తగినంత నీరు తాగరు. మన ఒంట్లో ప్రతి వ్యవస్థా సక్రమంగా పనిచేయటానికి నీరు ఎంతగానో తోడ్పడుతుంది. ఇది కణాలన్నింటికీ పోషకాలు, ఆక్సిజన్‌ను చేరవేయటం దగ్గర్నుంచి.. మూత్రాశయం నుంచి బ్యాక్టీరియాను బయటకు వెళ్లగొట్టటం వరకు రకరకాల పనులు చేస్తుంది.
తిన్న ఆహారం సరిగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మలబద్ధకాన్ని దరిజేరనీయదు. రక్తపోటును, గుండె వేగాన్ని నియంత్రిస్తుంది. అవయవాలను, కణజాలాలను రక్షిస్తూ.. కీళ్లు ఒరుసుపోకుండా చూస్తుంది. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ.. సోడియం వంటి ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతినకుండా చూస్తుంది. ఇంత కీలకమైంది కాబట్టే నీటి శాతం తగ్గితే బలహీనత, రక్తపోటు పడిపోవటం, తికమక, తలతిప్పు వంటి లక్షణాలు బయలుదేరతాయి. కాబట్టి రోజుకు సుమారు 2 లీటర్ల నీరు తాగేలా చూసుకోవాలి. ఇది కూడా ఆయా వ్యక్తులను బట్టి మారుతుంది. కొన్ని జబ్బులు గలవారు మరింత ఎక్కువగా తాగాల్సిన అవసరం ఉండొచ్చు. అలాగే వ్యాయామం, శారీరక శ్రమ చేసేవారు చెమట రూపంలో బయటకు వెళ్లే నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవాలి. మొత్తమ్మీద మూత్రం ముదురు రంగులో రాకుండా చూసుకుంటే తగినంత నీరు తాగుతున్నట్టే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Republic Day: పాక్ పాలకుడు గణతంత్ర వేడులకు వచ్చిన వేళ..
-
Movies News
Hunt Review: రివ్యూ: హంట్
-
Movies News
Samantha: సమంతా.. నువ్వు ఫీల్ అవుతావని ఆ పోస్ట్ పెట్టలేదు: నందినిరెడ్డి
-
Sports News
IND vs NZ: అతడి గురించి పెద్దగా చెప్పకపోవడం ఆశ్చర్యమేసింది: సంజయ్ మంజ్రేకర్
-
World News
Elon Musk: ‘మిస్టర్ ట్వీట్’గా పేరు మార్చుకున్న మస్క్.. యూజర్లలో అయోమయం..!
-
India News
Republic Day: నారీ శక్తి, స్వదేశీ గన్లు, అగ్నివీరులు.. తొలి ప్రత్యేకతలెన్నో..!