పొడుపు కథలు

చాలా కళ్లున్నాయి. కానీ చూడలేదు. ఏంటదీ?సంగీతాన్ని వినిపించని బ్యాండ్‌లు ఏవి?

Published : 02 Aug 2020 02:16 IST

1. ఉరుములు మెరుపులు లేనిదే ఉత్తరాది చెరువు ఊరికే నిండె.

2. ఇక్కడ విడిచిన కోడి ఇందూరు పోయింది.
3. అయిదు మొక్కలున్నాయి. వంచితే వంగుతాయి. ఊపితే ఊగుతాయి. కాని పీకితే రావు
4. ఎక్కలేని చెట్టు ఏటా బుట్టెడు కాయలు కాస్తుంది.


తమాషాప్రశ్నలు

1. చాలా కళ్లున్నాయి. కానీ చూడలేదు. ఏంటదీ?
2. సంగీతాన్ని వినిపించని బ్యాండ్‌లు ఏవి?
3. వేడి కాఫీని కాసేపు పక్కన పెడితే చల్లారి పోతాయి. మరి చల్లని ఐస్‌క్రీం కాసేపు పక్కన పెడితే ఏమవుతుంది?
4. చిలగడ దుంప, కాకులు, గోధుమలు వీటిలో ఒక విదేశీ నగరం పేరు దాగుంది.


క్విజ్‌ క్విజ్

1. మంచుతో చేసిన ఇంటిని ఏమని పిలుస్తారు?
2. భారత్‌లో అతి పెద్ద మంచి నీటి సరస్సు?
3. అన్‌ హ్యాపీ ఇండియా పుస్తక రచయిత?
4. ఇటీవల ‘ఖేలో ఇండియా గేమ్స్‌ - 2021’కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది.
5. ప్రపంచ పులుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం?


సుడోకు

ఈ సుడోకున్ళు 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండు సార్లు రాకూడదు.






జవాబులు:

పొడుపు కథలు: 1. కొబ్బరికాయ 2. లేఖ 3. వేళ్లు 4. మిరపకాయల చెట్టు
తమాషాప్రశ్నలు: 1. బంగాళ దుంప 2. రబ్బర్‌ బ్యాండ్‌, హెయిర్‌ బ్యాండ్‌ 3. కరిగిపోతుంది.4. చికాగో
క్విజ్‌ క్విజ్‌: 1. ఇగ్లూ 2. ఉలార్‌ సరస్సు 3. లాలా లజపతిరాయ్‌ 4. హర్యానా 5. జులై 29
6 తేడాలు కనుక్కోండి: 1. చెట్టు వేరు 2. కుండ 3.రాయి 4. పొద 5. కొమ్మ 6. తేనెటీగ రెక్క


సుడోకు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని