భలే... భలే... అద్భుత పక్షి!
హాయ్ ఫ్రెండ్స్... ఈ రోజు మనం ఓ సముద్ర పక్షి గురించి తెలుసుకుందాం సరేనా! మరింకెందుకాలస్యం.. చకచకా ఈ కథనం చదివేయండి.
హాయ్ ఫ్రెండ్స్... ఈ రోజు మనం ఓ సముద్ర పక్షి గురించి తెలుసుకుందాం సరేనా! మరింకెందుకాలస్యం.. చకచకా ఈ కథనం చదివేయండి.
ఈ పక్షి పేరు మ్యాగ్నిఫిసెంట్ ఫ్రిగేట్. దీని పేరులో ఉన్నట్లే ఇది నిజంగా ఓ అద్భుత పక్షి. ఫ్రెగటిడే కుటుంబంలో ఇదే పెద్దది. ఈ పక్షి 89 నుంచి 114 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటుంది. రెక్కల వెడల్పేమో 2.17 నుంచి 2.44 మీటర్ల వరకు ఉంటుంది. అంటే చాలా పొడవైన రెక్కలన్నమాట. రెక్కలైతే పొడవుంటాయి కానీ, వెడల్పు మాత్రం పెద్దగా ఉండదు. అంటే ఈ పక్షి రెక్కలు పొడవుగా, సన్నగా ఉంటాయన్నమాట. బరువేమో 1.1 నుంచి 1.59 కిలోగ్రాముల వరకు తూగుతాయి.
ఎర్ర సంచి.... ఎంతో అందం..
ఈ పక్షులు మెక్సికో, పెరూ.. ఫ్లోరిడా, బ్రెజిల్ తీరాల మధ్య ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిలో మగవాటికి గొంతు కింద ఎర్రటి సంచిలాంటి నిర్మాణం ఉంటుంది. ఆడ పక్షులకు ఇది ఉండదు. మగపక్షుల కన్నా... ఆడ పక్షులు పరిమాణంలో కాస్త పెద్దగా ఉంటాయి. ఈ పక్షులు నలుపు రంగులో ఉంటే... వీటి పిల్లలు మాత్రం తెలుపు రంగులో ఉంటాయి.
కాళ్లకు నీళ్లంటకుండా...!
ఈ మ్యాగ్నిఫిసెంట్ ఫ్రిగెట్‌లు చేపల్ని ఇష్టంగా తింటాయి. ముఖ్యంగా ఎగిరే చేపలంటే వీటికి భలే ఇష్టం. అవి సముద్ర జలాల మీద ఎగురుతుంటే ఈ పక్షులు వాటిని గాల్లోనే పట్టుకుని గుటుక్కుమనిపిస్తాయి. ఇంకా చిన్న చిన్న ట్యూనా చేపల్ని కూడా ఇష్టంగా తింటాయి. సాధ్యమైనంత వరకు ఈ పక్షులు నీటిలోకి దూకకుండానే పై నుంచే చేపల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాయి. గాల్లోనే వాటిని తినేస్తాయి. చాలా వేగంగా ఎగిరే నైపుణ్యమే వీటికి వేటలో సాయపడుతుంది. నేస్తాలూ! మొత్తానికి ఇవీ ఈ అద్భుత పక్షి విశేషాలు. ఈ సంగతులన్నీ భలే ఉన్నాయి కదూ!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్