మామిడి కాని మామిడిని...!
హాయ్ నేస్తాలూ...! నేను మామిడిని కాను. కానీ మామిడినే! ఏంటి అవాక్కయ్యారా? మామిడిని అంటూనే... మళ్లీ మామిడిని కాదు అంటున్నానేంటి అని ఆశ్చర్యపోతున్నారు కదూ! ఆ విశేషాలు చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను. మరి నా సంగతులేంటో ఎంచక్కా తెలుసుకుంటారా? మరింకెందుకాలస్యం... ఇది చదివేయండి మరి.
మీకు ఇంతకీ నా పేరేంటో చెప్పనేలేదు కదా! నన్ను మాప్‌రాంగ్ అంటారు. ప్లమ్ మ్యాంగో, మ్యాంగో ప్లమ్ అని కూడా పిలుస్తారు. నేను ఆగ్నేయాసియా ప్రాంతానికి చెందిన చెట్టును. నన్ను అంతా మామిడి అంటారు కానీ నేను నిజానికి జీడిమామిడి జాతికి చెందిన చెట్టును.
నిత్య హరితం..
నేను మామిడి చెట్టులానే నిత్యం పచ్చని ఆకులతో కళకళలాడుతూ ఉంటాను. 25 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాను. నాకు కాసే కాయలు ఆకుపచ్చని రంగులో చాలా చిన్నగా ఉంటాయి. కేవలం 2 నుంచి 5 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయంతే. ఇవి పండ్లుగా మారాక పసుపు వర్ణం సంతరించుకుంటాయి. గుజ్జు కూడా మెత్తబడుతుంది.
అల్ఫాన్సోలా!
నా చెట్టుకు కాసిన పండ్ల రుచి అచ్చం అల్ఫాన్సో రకపు మామిడిపండ్లలానే ఉంటుంది. థాయ్‌లాండ్, ఇండోనేషియాలో నేను వేరు వేరు సమయాల్లో కాపు కాస్తాను. థాయ్‌లాండ్‌లో నవంబర్-డిసెంబర్ మధ్యలో పూత వస్తుంది. ఏప్రిల్-మేలో కాయ వస్తుంది. ఇండోనేషియాలో మాత్రం జూన్-నవంబర్ మధ్యలో పూత వస్తుంది. మార్చి-జూన్ మధ్యలో కాయలు కాస్తాయి. నేను ఈ రెండు దేశాలే కాకుండా లావోస్, మలేషియా, మయన్మార్‌లోనూ పెరుగుతాను.
పండ్లే కాదు పత్రాలూ...
నాకు కాసే పండ్లను మాత్రమే కాదు... ఆకులను కూడా తినేయొచ్చు. ముఖ్యంగా లేతగా ఉన్నప్పుడు భలే రుచిగా ఉంటాయి. వీటిని సలాడ్లలోనూ ఉపయోగిస్తారు. మీకు మరో విషయం తెలుసా.. మామిడి కాయలతో ఎలాగైతే పచ్చడి చేసుకోవచ్చో... నా చెట్టు కాయలతోనూ ఎంచక్కా పచ్చడి పెట్టుకోవచ్చు.
చక్కని చిక్కని నీడనిస్తా...
నా పత్రాలు నిత్యం పచ్చగా ఉంటాయి. ఒత్తుగా కూడా ఉంటాయి కాబట్టి నేను చక్కటి... చిక్కటి నీడను ఇస్తాను. అందుకే ఎన్నో జీవులు, పక్షులు నా నీడలో సేద తీరతాయి. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. భలే ఉన్నాయి కదూ నా సంగతులు. ఇక ఉంటామరి బై.. బై...!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
MLC kavitha: ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంలో విచారణ.. 3 వారాలకు వాయిదా
-
World News
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. రంగంలోకి ‘అణు’ తూటాలు..!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Gundu Sudarshan: ‘ఆవిడని కూర్చోపెట్టండి.. ఎంతసేపు నిలబెడతారు’ అని అరిచాడు...
-
World News
Pakistan: ఇమ్రాన్‌ను సాగనంపాలి.. లేకపోతే మేం పోవాలి: పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
General News
viveka murder case : వివేకా హత్య కేసు ఇంకా ఎంత కాలం విచారిస్తారు?: సీబీఐని ప్రశ్నించిన సుప్రీం