రైల్లో వెళుతూ...గాల్లో తేలుతూ!

ఆ రైలు ఎక్కితే రోలర్‌కోస్టర్‌ ఎక్కినట్టే... రయ్యిమంటూ పైకి దూసుకుపోతుంది... ఎంతో ఎత్తులో వెళ్లిపోతుంది... ఏటవాలుగా ప్రయాణించేస్తుంది... ఓ వింత అనుభూతినిస్తుంది... రైలేంటీ? రైడ్‌లా మారడం ఏంటీ? చదివేస్తే మీకే తెలుస్తుంది!....

Published : 24 Aug 2019 00:17 IST

ఆ రైలు ఎక్కితే రోలర్‌కోస్టర్‌ ఎక్కినట్టే... రయ్యిమంటూ పైకి దూసుకుపోతుంది... ఎంతో ఎత్తులో వెళ్లిపోతుంది... ఏటవాలుగా ప్రయాణించేస్తుంది... ఓ వింత అనుభూతినిస్తుంది... రైలేంటీ? రైడ్‌లా మారడం ఏంటీ? చదివేస్తే మీకే తెలుస్తుంది!

కాస్త ఎత్తున్న ప్రదేశంలోంచి రైలు వెళుతుంటేనే గమ్మత్తుగా ఉంటుంది. వంతెన మీదుగా ప్రయాణిస్తున్న రైల్లోంచి కిందికి చూస్తేనే భలేగుందనిపిస్తుంది. మరి ఏటవాలుతో ఉన్న రైల్వే లైనుపై నుంచి వెళితే? అబ్బ ఇంకెంత బాగుంటుంది? మీరూ అలాంటి రైలు ఎక్కాలా? అయితే విమానం ఎక్కి స్విట్జర్లాండ్‌కి వెళ్లండి.

* ఇక్కడ స్క్విజ్‌ వ్యాలీ స్టేషన్‌ నుంచి పర్వతపు ఊరు స్టూస్‌కు మధ్య ఉంటుందీ రైల్వే లైన్‌. ప్రపంచంలోనే అత్యంత ఏటవాలుగా ఉండే కదిలే కేబుల్‌ రైలు మార్గం ఇదే.
* సముద్రమట్టానికి 4300 అడుగుల ఎత్తులో ఉండే ఈ రైలుమార్గం 1720 మీటర్ల ట్రాక్‌తో ఉంటుంది.
* ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ ప్రత్యేకమైన మార్గం కోసం నాలుగు రొటేటింగ్‌ కేబిన్లతో ఉండే రైలును తయారుచేశారు. దీంట్లో మొత్తం 34 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు.
* కింది నుంచి పైకి 48 డిగ్రీల కోణంలో జామ్మంటూ సెకనుకు పది మీటర్ల వేగంతో ఈ రైలు వెళ్లిపోతుంటే గుండెలు అదిరిపోతాయి. గాల్లో తేలిపోతుంటే ఇదో సాహసంలా అనిపించకమానదు.
* ఈ రైడులాంటి రైలును ఎక్కడానికి సందర్శకులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని