ఇది క్లిక్ క్లిక్‌ల వంతెన!
గోల్డెన్‌గేట్ బ్రిడ్జ్
హల్లో నేస్తాలూ!
నేను చిన్నూనొచ్చేశా...ఈసారి అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్లొచ్ఛా..
అక్కడ గోల్డెన్‌గేట్ బ్రిడ్జ్ చూసొచ్ఛా.. వండర్ ఆఫ్ మోడ్రన్ వరల్డ్‌గా దానికి పేరు...దాని విశేషాలు మీ కోసం మోస్కొచ్చా!
కట్టడం : గోల్డెన్ గేట్ బ్రిడ్జ్
ఉన్నది : పసిఫిక్ మహాసముద్రంపై
దేశం : అమెరికా
పొడవు : 1.6కిలోమీటర్లు
వెడల్పు : 90 అడుగులు
ఎత్తు : 746 అడుగులు
ఎక్కడుందంటే? గోల్డెన్ గేట్ బ్రిడ్జ్.. ఈ పేరు వినగానే చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది. ఇది అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. పసిఫిక్ మహా సముద్రంలో శాన్‌ఫ్రాన్సిస్కో, మెరైన్ కౌంటీలను కలుపుతూ ఉంటుంది. వంతెన మీద నుంచి వెళుతున్నప్పుడు ఎలా ఉన్నా సముద్ర తీరంలో ఉన్న వ్యూపాయింట్ నుంచి దీన్ని చూస్తే అబ్బ! భలేగా అనిపించిందిలేండి. |
ఎప్పుడు కట్టారు? అక్కడున్న అంకుల్ని అడిగితే దీని పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పేశారు. దీన్ని కట్టాలని 1872లోనే అనుకున్నారుగానీ 1919వరకూ దీనిపై కచ్చితమైన అభిప్రాయానికి రాలేదట. 1920లో వేరొక డిజైన్‌తో దీన్ని ప్రారంభించాలనుకున్నారు. స్థానిక పత్రికలన్నీ ఆ డిజైన్ బాగోలేదని తిట్టిపోశాయి. దీంతో డిజైన్ మార్చి 1933లో దీన్ని కట్టడం మొదలుపెట్టారు. 1937లో వంతెనపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. అన్నట్టు దీన్ని దేనితో కట్టారో చెప్పలేదు కదూ. ఇది స్టీల్ వంతెన. తీగల సాయంతో రెండు ఎత్తయిన స్తంభాలకు వేలాడేలా ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జ్. |
దీని ప్రత్యేకత ఏంటి? దీన్ని చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. తీగల సాయంతో కట్టిన బ్రిడ్జ్‌లనే సస్పెన్షన్ బ్రిడ్జ్‌లంటారు. ఇప్పుడంటే ఇలాంటి పెద్ద వంతెనలు చాలా వచ్చేశాయిగానీ ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కట్టేనాటికి ప్రపంచంలోనే పొడవైన, ఎత్తయిన సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇదే. ‘వండర్ ఆఫ్ మోడ్రన్ వరల్డ్’గా దీన్ని ఇంజినీర్లు ప్రశంసిస్తుంటారు. ఇంకా ప్రపంచంలో ఎక్కువమంది ఫొటోలు తీసే వంతెనా ఇదేనట. |
రంగు వెనక కథ! అన్నట్లు దీని రంగు చూశారా? ఎర్రగా ఉంది. దీన్ని కట్టినప్పుడు ఒకవైపంతా సైనికుల అధీనంలో ఉండేదిట. దీంతో వారు వీటికి నీలం, పసుపు రంగుల్ని వెయ్యమని అవైతే కంటికి బాగా కనిపిస్తాయనీ చెప్పార్ట. అయితే కొన్న తర్వాత ఎరుపు రంగు వేసిన స్టీల్ కడ్డీలు ఇక్కడికి చేరాయి. దీంతో వాటితోనే ముందుగా వంతెన కట్టేశారు. తర్వాత ఈ రంగే ఎక్కువ దూరం కనిపిస్తున్నట్లు ఉందని చెప్పి ఇదే రంగును వంతెనకు ఉంచేశారు. |
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!
-
World News
Heartbreaking Story: మా అమ్మ కన్నీటితో డైరీలో అక్షరాలు తడిసిపోయాయి..!
-
World News
ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ మాయం..ఎయిర్టాగ్తో నిందితుడిని గుర్తించిన ప్రయాణికుడు