Published : 19 Sep 2019 00:12 IST

వీటికి ఎన్ని గుండెలు?

మనకో గుండె... దానిలో నాలుగు గదులు... అన్ని జీవులకీ ఇలానే ఉంటాయనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఒకటి కన్నా ఎక్కువ గుండెలున్న జీవులు కొన్ని ఉన్నాయి. అవే ఇవాళ ఇలా మన పేజీలోకొచ్చేశాయి.

ఆక్టోపస్‌

సెఫలోపొడా కుటుంబానికి చెందిన జీవుల్లో ఆక్టోపస్‌ ఒకటి. దీనికి మూడు గుండెలుంటాయి. నీలం రంగు రక్తం ఉంటుంది. దీనిలో రెండు గుండెలు రక్తాన్ని మొప్పల్లోకి పంప్‌ చేస్తే, ఒకటి మాత్రం రక్తాన్ని శరీరమంతా వెళ్లేలా చేస్తుందట.

హేగ్‌ ఫిష్‌

ముద్రాల్లో జీవించే ఇది పుట్టడంతోనే నాలుగు గుండెలతో పుడుతుంది. రక్తాన్ని సరఫరా చేయడానికి ఒకటి ప్రధాన గుండెగా పనిచేస్తుంది. మిగిలిన మూడు దానికి సహాయక హృదయాలుగా పనిచేస్తాయి.

వానపాము

నేలలో కాస్త తవ్వగానే వానపాములు కనిపిస్తుంటాయి కదా. పొరపాటున అవి సగం ముక్క అయినా రెండుగా బతికేస్తాయి. ఇందుకు కారణం వానపాములో ఐదు గుండెలుండటమే. కాకపోతే వాటికి పూర్తి గుండెకు ఉండే లక్షణాలు ఉండవు. అందుకనే గుండెల్లా... ఉన్న వీటిని స్యుడో హార్ట్స్‌ అంటారు.

స్క్విడ్‌

ముద్రాల్లో ఉండే ఈ స్క్విడ్లకు మూడు గుండెలుంటాయి. ఒకటి ప్రధాన గుండెకాగా, మిగిలినవి రెండు బ్రాంచియల్‌ హార్ట్స్‌. ఇవి రక్తాన్ని మొప్పల్లోకి నెడతాయి. అక్కడకెళ్లిన రక్తం ఆక్సిజన్‌తో కలిసి మళ్లీ ప్రధాన గుండెకు చేరుకుంటుంది. అక్కడి నుంచి శరీరమంతటికీ చేరుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు