‘చూడరాని ఊరు’ చూసొద్దాం!

చూడరని ఊరు చూసోద్దాం! హాయ్ ఫ్రెండ్స్... నేను మీ చిన్నూని... మొన్నీ మధ్య బిజింగ్ వెళ్లొచ్చా... అక్కడో అద్భూతమైన రాజా నిలయం చూశా... పేరు ఫర్ బిడెన్ సిటీ... దానిసంగతులు విని తెగ ఆశ్చర్యపోయా అవేంటో చెప్పడానికే ఇలా వచ్చా! ఈ ఫర్‌బిడెన్‌ సిటీ అనే పేరు గమ్మత్తుగా ఉంది కదూ! అంటే నిషిద్ధనగరమని అర్థం. అప్పట్లో సామాన్య ప్రజల్ని లోపలికి అనుమతించేవారు కాదట. అందుకే ఆ పేరు. అయితే ఇప్పుడు ఎవరైనా ఎంచక్కా వెళ్లి చూసి రావచ్చు...

Updated : 21 Sep 2019 05:00 IST

హాయ్ ఫ్రెండ్స్... నేను మీ చిన్నూని... మొన్నీ మధ్య బిజింగ్ వెళ్లొచ్చా... అక్కడో అద్భూతమైన రాజా నిలయం చూశా... పేరు ఫర్ బిడెన్ సిటీ... దానిసంగతులు విని తెగ ఆశ్చర్యపోయా అవేంటో చెప్పడానికే ఇలా వచ్చా!

పేరు ఎలా పెట్టారంటే?

ఫర్‌బిడెన్‌ సిటీ అనే పేరు గమ్మత్తుగా ఉంది కదూ! అంటే నిషిద్ధనగరమని అర్థం. అప్పట్లో సామాన్య ప్రజల్ని లోపలికి అనుమతించేవారు కాదట. అందుకే ఆ పేరు. అయితే ఇప్పుడు ఎవరైనా ఎంచక్కా వెళ్లి చూసి రావచ్చు.

ఎక్కడుంది?


చైనాలోని బీజింగ్‌ పట్టణంలో ఉందిది.ప్రపంచంలోనే అతి పెద్ద రాజ నిలయం. మింగ్‌, కింగ్‌ వంశాలకు చెందిన 24 మంది చక్రవర్తులు ఇందులో నివసించారు. ఇప్పుడేమో రాజుల కాలం నాటి వస్తువులతో, రకరకాల కళాకృతులతో ఉంటుంది. ఇంచుమించు పది లక్షల కళాఖండాలుంటాయిందులో. దీనికి ప్యాలెస్‌ మ్యూజియం అనే పేరూ ఉంది.

ఎంత పెద్దదో!

ఫర్‌బిడెన్‌ సిటీ చాలా చాలా పెద్దది. నాలుగు వైపులా ద్వారాలతో ఎరుపు రంగు గోడలు, పసుపు పచ్చని రూఫ్‌ టైల్స్‌తో చైనీస్‌ సంప్రదాయ వాస్తుకళతో కనువిందు చేస్తుంది. మొత్తం 180 ఎకరాల విస్తీర్ణంతో, దాదాపు 8,886గదులతో ఉంటుంది. చుట్టూ 26 అడుగుల ఎత్తయిన గోడ ఉంటుంది. దీంతో పాటు కందకమూ రక్షణగా ఉంటుంది. దీని వెడల్పు 165 అడుగులు. ఈ కోట మొత్తం చూడ్డానికి రెండు మూడు గంటల సమయం పడుతుంది.

ఎప్పుడు, ఎవరు కట్టారు?

హాంగ్‌వూ చక్రవర్తి నాంజింగ్‌ నుంచి రాజధానిని బీజింగ్‌కి మార్చి 1406లో ఫర్‌బిడెన్‌ సిటీ నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. ఇంచుమించు 14 సంవత్సరాల పాటు పది లక్షల మంది కూలీలు పనిచేశారు. దీనికోసం ప్రత్యేకమైన కలప, రకరకాల మార్బుల్స్‌ ఉపయోగించారు. రాజమందిరాల కోసం బంగారు ఇటుకల్నీ వాడారట.

ఎక్కడెక్కడి నుంచో!

ది ఉదయం నుంచి సాయంత్రం వరకూ తెరిచే ఉంటుంది. రోజూ దాదాపు 80 వేల మంది పర్యటకులు వస్తుంటారు. పురాతన కాలం నాటి కలప నిర్మాణాల్లో అతి పెద్ద భవన సముదాయంగా యునెస్కో దీనికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపునిచ్చింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని