వాలు కళ్ల వయ్యారి... వేల కళ్ల సింగారి!
మన పురాణాల్లో... మూడు కళ్లున్న శివుడి గురించీ... వెయ్యి కన్నులున్న ఇంద్రుడి సంగతీ వినే ఉంటారు...
మరి తెలుసా? మూడు కళ్ల సరీసృపం... ఐదు కళ్ల కీటకం... వేయి కళ్ల జీవి... ఆశ్చర్యంగా ఉందా? వివరాలు చదివేయండి!
చీటాన్ దీని పేరే మీరు వినుండరు. ఇదీ మొలస్కా జీవే. ఎనిమిది భాగాలతో ఉండే దీని పెంకుపై బోలెడన్ని కళ్లు చుక్కల్లా ఉంటాయి. ఈ చిన్న చిన్న కళ్లు మొత్తం వెయ్యి వరకు ఉంటాయంటే నమ్మగలరా? ఈ కళ్లని ఓసిలీ అంటారు. వీటిల్లో రెటినా, లెన్స్ ఉంటాయి. బండరాళ్ల కింద దాక్కుని జీవించే ఇది నిశాచర జీవి. రోజంతా విశ్రాంతి తీసుకుని రాత్రివేళల్లో వేటకు బయలుదేరుతుంది. |
ప్రేయింగ్ మాంటిస్ ఈ పేరేంటో చిత్రంగా ఉందే అనుకుంటున్నారా? గొల్లభామ కీటకం తెలుసుగా. అదే ఇది. వీటిల్లో ఇంచుమించు 2,400 రకాల జాతులున్నాయి. దీన్ని పరీక్షగా చూస్తే తెలుస్తుంది దీనికి ఐదు కళ్లున్నట్లు. అవును రెండు కళ్లేమో కీటకాల్లో ఉండే సంయుక్త నేత్రాలు ఉంటాయి. మళ్లీ దీని తలపై మూడు చిన్న చిన్న కళ్లుంటాయి. రెండు పెద్ద కళ్లతో కదలికల్ని గుర్తిస్తే చిన్ని కళ్లేమో కాంతిని గుర్తిస్తాయి. |
టూటారా ఇదో సరీసృపం. లివింగ్ ఫాసిల్ అని దీనికి పేరు. ఎందుకంటే ఇవి డైనోసార్ల కాలం నుంచీ ఉన్నాయ్. ఎక్కువగా న్యూజిలాండ్‌లో కనిపిస్తుంటాయి. అసలు విషయం ఏమంటే దీనికి మూడు కళ్లుంటాయి. అవును నిజమే. మామూలుగా రెండు కళ్లతోపాటు తలపై మూడో కన్ను ఉంటుంది. ఈ కన్నులోనూ కార్నియా, రెటీనా, నరాలు ఇలా కంటి భాగాలన్నీ ఉంటాయి. అయితే దీనికో ప్రత్యేకత ఉంది. టూటారా పుట్టినప్పుడు శరీరం కళ్లతో పాటు పొలుసులతో ఉంటుంది. ఆ సమయంలోనే ఈ మూడో కన్నుతో చూస్తుంది. ఆ తర్వాత ఈ కన్నును పరిసరాల్ని గుర్తించడానికి మాత్రమే వాడుతుంది. అందుకే ఈ మూడో కన్నును పాక్షిక కన్ను అని పిలుస్తారు. |
స్కాలోప్ ఇదో సముద్రపు జీవి. వీటిల్లో ఇంచుమించు 400 రకాలుంటాయి. మెత్తటి శరీరంతో ఉండే మొలస్కాల్లో ఒకటి. నత్తలు, శంఖాలు, సముద్రపు స్లగ్స్, ఆక్టోపస్, స్క్విడ్ వంటి జీవులకు బంధువు. ఆరు అంగుళాల పెంకుతో భలేగా ఉంటుందిది. చూస్తే ఇది జీవా? అసలు దీనికి కళ్లేవీ? అన్నట్టు కనిపిస్తుంది. కానీ దీనికి అచ్చంగా 50 నుంచి 100 కళ్లు ఉంటాయి. అవును దీని శరీరంలో ఎక్కడైనా ఉండే ఈ కళ్లు నీలం రంగులో మెరిసిపోతూ ఉంటాయి.రెండు కళ్లతోనే అన్నీ చూసేస్తాం. మరి ఇన్ని కళ్లు ఉంటేనా? అనుకుంటున్నారా? అయితే ఇవి ఆకారాల్ని గుర్తించలేవు కానీ వెలుగు, చీకట్లను పసిగట్టేస్తాయి. దీంతో ఇది హాయిగా నీటిలో ఈత కొట్టేస్తూ తిరుగాడుతుంటుంది. శత్రువుల నుంచి కాపాడుకుంటుంది. |
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!
-
World News
Heartbreaking Story: మా అమ్మ కన్నీటితో డైరీలో అక్షరాలు తడిసిపోయాయి..!