B ఫర్ బలం!
‘‘ఒకటి, రెండు, మూడు... ఏంటవి? అనుకుంటున్నారా? ఇవే మా పేర్లు. అవును... మాకు విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, బి7, బి9, బి12.. ఇలా బోలెడు పేర్లు పెట్టేసుకున్నారాయె. అందుకే అలా చెప్పాం. అయినా ఇప్పుడు అర్థమై ఉంటుందే మీ ముందుకు వచ్చింది బి విటమిన్లని. మా కబుర్లు చెప్పాలని కట్టకట్టుకొని వచ్చేశాం.
ఆకేసి... అన్నంపెట్టి... పప్పేసి... చారేసి...నెయ్యేసి... పెరుగేసి... ఆం ఆం అంటూ తినేసి...అంటూ అమ్మ బుజ్జగిస్తూ అన్నం తినిపించేస్తుంది...ఎందుకంటే ఇవన్నీ తింటేనే కదా మనకు శక్తి వచ్చేది...
అది సరే... మరి ఈ శక్తి శరీరానికి ఎలా చేరుతుంది? ఎలాగో తెలియాలంటే ఇది చదివేయండి!
* అంకెలే కాదు... మాకు ప్రత్యేకంగా పేర్లూ ఉన్నాయి. విటమిన్ బి1 అసలు పేరు థయమిన్. బి2 పేరు రైబోఫ్లావిన్. నియాసిన్‌ను బి3, ప్యాంటోథెనిక్ యాసిడ్‌ను బి5, పైరిడాక్సిన్‌ను బి6, బయోటిన్‌ను బి7, ఫోలిక్ యాసిడ్‌ను బి9, సైనకోబలమిన్‌ను బి12 అని పిలుచుకుంటూ ఉంటారు. అన్నింటిని కలిపేసి ముద్దుగా బి గుంపు.. అదే బి కాంప్లెక్స్ అంటారు.
* మా రూపాలు వేర్వేరైనా చేసే పనులు దాదాపు ఒకటేనండి. కబడ్డీ, క్రికెట్ వంటి ఆటల్లో మీరంతా కలిసికట్టుగా ఆడినట్టే మేమూ జట్టు కట్టుకొని పనిచేస్తామన్నమాట.
*ముఖ్యమైన విషయం ఏంటంటే... మీరు రకరకాల పదార్థాలు తింటుంటారుగా.. వాటిల్లో పిండి పదార్థాలు, కొవ్వుల లాంటివెన్నో ఉంటాయి. ఇవి శక్తిగా మారటానికి, దాన్ని శరీరం వినియోగించు కోవటానికి సాయం చేసేది మేమే.
*మిమ్మల్ని చూడగానే అందరికీ ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంటుంది కదా. ఎందుకంటే మీ చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. చూడగానే ముద్దొస్తారు. ఇలా మిమ్మల్ని కళకళలాడేలా చేసేదీ మేమే.
* అంతేనా? మీరు చదువుకునేటప్పుడు కళ్లు బాగా కనిపించటానికీ, మెదడు, రోగనిరోధకశక్తి, కండరాలు పెరగటానికీ తోడ్పడతాం. మీరు ఇప్పుడు మంచి తెలివితేటలతో చదువుల్లో బాగా ముందుంటున్నారంటే
కారణమేంటో తెలుసా? ఇదిగో ఈ ఫోలిక్ యాసిడే. మీరు అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఇది నాడులు ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది.
* ఎర్ర రక్తకణాలు ఉంటేనే అన్ని భాగాలకు ఆక్సిజన్ అందుతుంది. ఇదిగో ఈ ఎర్ర రక్త కణాలు తయారు కావటానికీ ఉపయోగపడతాం. వీటిని బట్టే తెలుసుకోవచ్చు మేమెంత ముఖ్యమో. మీరు చదివినవి గుర్తుండాలన్నా, ఆటలు ఆడుకునేటప్పుడు కాళ్లు చేతులు చక్కగా కదలాలన్నా నాడులు బాగుండాలి. ఇవి సరిగా పనిచేయటానికి సాయం చేసేదీ మేమే.
* ఈపక్కగా నిలబడ్డ బి12 అయితే మీకు మతిమరుపు రాకుండా కాపాడుతుంది. ఇది నాడుల మీద రక్షణగా ఉండే పొరను ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు పాఠాల్లో డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ అని చదువుకొనే ఉంటారుగా. వీటి నకళ్లు తయారుకావటానికీ బి12 ఉపయోగపడుతుంది. అంటే కొత్త కణాల ఉత్పత్తికిది చాలా కీలకమన్నమాట. ఇలా మాలో ఒక్కోటి ఒక్కోలా మీకు మేలు చేస్తుంటాయి.
* మీరు మమ్మల్ని తరచూ తీసుకోవాల్సిందే. ఎందుకంటే మేం నీటిలో కరిగిపోయే విటమిన్లం కదా. ఒంట్లో నిల్వఉండం. శరీరం వినియోగించుకోకపోతే మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాం.
* ఇంతకీ మేం ఎందులో ఎక్కువగా ఉంటామో తెలుసా? మాంసాహారంలో. దంపుడు బియ్యం వంటి పొట్టు తీయని ధాన్యాల్లోనూ ఉంటాం. చేపలు, చికెన్, గుడ్లు, మాంసం, పాలు, పాలతో చేసే పదార్థాలు, పాలకూర వంటి ఆకు కూరలు, చిక్కుళ్లు, బఠానీలు, బంగాళాదుంపలు, అరటిపండ్లు, మిరపకాయల వంటివన్నీ మా ఆవాసాలే. అందుకే ఇవన్నీ తినండేం.
*లేకపోతే మా మోతాదులు తగ్గిపోతాయి. అప్పుడు మీలో ఉత్సాహం తగ్గి ఎప్పుడూ నిద్ర మత్తుగా అనిపిస్తుంది. నోట్లో, పెదవుల చివర్లలో పుండ్లు పడతాయి. నాలుక మందంగా
అవుతుంది. తరచూ జలుబు వంటి జబ్బులు రావొచ్చు. చేతులు కాళ్లు తిమ్మిర్లు పడతాయి. చర్మం మీద దద్దుర్లు రావొచ్చు. మీకు మాటిమాటికీ చిరాకు కలగొచ్చు. అందుకే మేం తగ్గిపోతే వెంటనే డాక్టర్లు మందులు ఇచ్చేస్తుంటారు. ఇప్పటికైనా తెలిసిందా మా గొప్పతనమేంటో. అందుకే అమ్మానాన్నలు చెప్పినట్టుగా అన్ని పదార్థాలు తినండి. అది తినను, ఇది తినను అని మారాం చేయకండి. ఎందుకంటే అన్నిసార్లూ మేం ఎందులో ఉన్నామో అని చూసుకొని తినలేరుగా. సెలవిప్పిస్తే వెళ్లొస్తాం. బైబై మరి’’
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Bandi sanjay: కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలెందుకు భరించాలి? సహించాలి?: బండి సంజయ్
-
General News
Andhra News: పోలీసులకు ఎదురుదెబ్బ.. అంజన్‌ను విడుదల చేయాలని కోర్టు ఆదేశం
-
India News
Karnataka: భాజపా.. కాంగ్రెస్.. ముఖ్యమంత్రి ‘ముఖచిత్రం’ ఉంటుందా..?
-
Politics News
Harish Rao: ఇదేనా భాజపా చెబుతోన్న అమృత్కాల్?: హరీశ్‌రావు ఫైర్
-
Movies News
Social Look: వాణీకపూర్ ‘క్రైమ్ థ్రిల్లర్’.. చీరలో శోభిత హొయలు!
-
Politics News
BS Yediyurappa: సిద్ధూపై యడ్డీ తనయుడి పోటీ..?