ఆల్చిప్ప..అయ్ బాబోయ్.. ఎంతో గొప్ప!
హలో ఫ్రెండ్స్.. బాగున్నారా..నేను మీ ఆల్చిప్పను.. మీ ముత్యపు చిప్పను! మిమ్మల్ని పలకరిద్దామని...పనిలో పనిగా నా విశేషాలు కొన్ని మీకు చెప్పిపోదామని ఇలా వచ్చాను..
నన్ను పేరుకు ఆల్చిప్ప అంటారు... కానీ మళ్లీ నాలో కొన్ని వందల రకాలున్నాయి.
* మాలో కొన్ని సముద్రాల్లో.. మరి కొన్ని నదుల్లో.. ఇంకొన్ని చెరువులు.. చిన్న చిన్న కాలువల్లోనూ నివసిస్తుంటాయి. శంఖువులను ఓ రకంగా మాకు దగ్గరి బంధువులు అని చెప్పుకోవచ్చు.
* నేను మొలస్కా జాతికి చెందిన జీవిని.
* మమ్మల్ని షెల్‌ఫిష్ అని కూడా అంటుంటారు. నిజానికి మరో అయిదు, ఆరు రకాల జీవుల్ని కూడా షెల్‌ఫిష్‌గానే పిలుస్తారు.
* నేను చాలా మెత్తగా ఉంటాను. అందుకే నా రక్షణ కోసం రెండు కవచాల మధ్య భద్రంగా ఉంటాను. వీటినే కర్పరం అంటారు. నాతో పాటే నా కర్పరమూ పెరుగుతుంది.
* ఈ కర్పరాల్లో ప్రధానంగా కాల్షియం కార్బొనేట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇవి చాలా గట్టిగా ఉంటాయి.
* మాలో రకాల్ని బట్టి మేము రకరకాల పరిమాణాల్లో.. ఉంటాం. సుమారుగా 10 సెంటీమీటర్లుంటాం.
* మాలో దాదాపుగా 3,000 రకాల జాతులున్నాయి.
* మేం నీటిలో ఉండే నాచును ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాం.
* మీకో విషయం తెలుసా? మాలో తయారయ్యే ముత్యాన్నే కాదు.. మా కర్పరాలనూ ఆభరణాలు, అలంకరణ వస్తువుల తయారీలో వాడతారు.
* మేం ఈ భూమి మీద కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం నుంచే ఉంటున్నాం.
* మీ దగ్గర తక్కువ కానీ...కొన్ని ప్రాంతాల్లో మమ్మల్ని ఆహారంగానూ తీసుకుంటారు.
* ఆస్తమాతో బాధపడుతున్నవారు మమ్మల్ని తినకూడదంటారు.
* మేం తెలుపు, బూడిద, ఎరుపు, నీలం, ఆకుపచ్చ.. ఆఖరుకు నలుపు రంగుల్లోనూ ఉంటాం.
* మాలో బీ 12 విటమిన్ సమృద్ధిగా ఉంటుంది.
* ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండటం వల్ల మమ్మల్ని ఆహారంగా తీసుకుంటే... గుండెకు చాలా మంచిదంటారు.
* మరీ అతిగా తీసుకున్నా.. కాడ్మియం, మెర్క్యురీలాంటి మూలకాల వల్ల ఆరోగ్యానికి అంత మంచిదీ కాదంటారు. అంటే మితంగా తింటే ఫర్వాలేదన్నమాట.
* మీకు ఇంకో విషయం తెలుసా?.. మీలో కొందరు అమ్మమ్మ, నాయనమ్మ ఇళ్లకు పోయినప్పుడు ఎప్పుడైనా అష్టాచెమ్మా ఆడారా? అందులో వాడే గవ్వలూ... అవి బతికుండగా... మా బంధువులే!!
సరే మిత్రులారా...మా అమ్మ పిలుస్తున్నారు ఉంటాను మరి..బై.. బై..!!
ముత్యపు ముచ్చట్లు
* మాలో చాలా రకాలున్నప్పటికీ అవన్నీ ముత్యాలను తరచుగా తయారు చేయలేవు. కొన్ని రకాలు మాత్రమే ఎక్కువగా నాణ్యమైన ముత్యాలను తయారు చేస్తాయి. ఇందుకోసమే మమ్మల్ని వేటాడుతుంటారు.. పెంచుతుంటారు.
* ఇంతకీ ముత్యాలు ఎలా తయారవుతాయంటే.. ఇసుక లేదా.. ఏవైనా ఇసుక రేణువులు నీటి ప్రవాహ వేగం వల్ల మా కర్పరాల లోపలికి వెళ్లిపోతాయి. అలాంటప్పుడు మేం మా రక్షణ కోసం కొన్ని స్రావాలను వదులుతాం. అవి ఆ రేణువు చుట్టూ చేరుకుని ముత్యాల్లా మారతాయి.
* సహజ సిద్ధంగా ముత్యాలు తయారు కావాలంటే చాలా పెద్ద ప్రక్రియ. అందుకే మా పెంపకందారులు మా కర్పరాలను కొద్దిగా తెరిచి... అందులోకి చిన్న చిన్న రేణువులను వదులుతారు. అప్పుడు మేం మా రక్షణ కోసం కొన్ని పదార్థాలను స్రవిస్తాం. ఇలా మీ జోక్యంతో ఎక్కువ సంఖ్యలో ముత్యాలు తయారవుతాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
Crime News
Fake Currency: నకిలీ నోట్ల అడ్డా.. చేనేతపురి!
-
Ts-top-news News
Salarjung Museum: సాలార్జంగ్ మ్యూజియం.. ఆన్లైన్లోనూ వీక్షించొచ్చు..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
‘విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం.. ఏపీ నుంచి ప్రతిపాదనలు రాలేదు’
-
Politics News
Vitapu-Botsa: విఠపు పరీక్షలో.. బొత్సకు 2 మార్కులే!