ఓహో.. గులాబి మామా!
లాక్‌డౌన్... మనందరిలానే చిన్నూ కూడా ఇంట్లోనే ఉన్నాడు. మామయ్యతో కలిసి వార్తలు చూస్తున్నాడు.. ఈరోజు పింక్ మూన్ కనిపిస్తుందని విన్నాడు... గులాబీ చందమామా! అని ఆశ్చర్యపోయాడు... చిన్నూకి బోలెడన్ని సందేహాలు వచ్చేశాయ్... ఇంకేముంది. పక్కనే ఉన్న మామాయ్యని అడిగితే చెప్పేశాడు. అవేంటో మనమూ తెలుసుకుందామా!
చిన్నూ: మామయ్యా! అసలేంటీ పింక్ మూన్?
మామయ్య: ఈరోజున అంటే ఏప్రిల్ 8న కనిపించనున్న సూపర్ మూనే పింక్‌మూన్.
చిన్నూ: ఇంతకీ సూపర్ మూన్ అంటే?
మామయ్య: అదా... అతి పెద్దగా కనిపించే పూర్ణచంద్రుళ్లను సూపర్ మూన్స్ అంటారు. భూమి చుట్టూ తిరిగే కక్ష్యలో చంద్రుడు ఒకొక్కప్పుడు భూమికి అత్యంత దగ్గరగా వస్తాడు. అప్పుడు కనిపించే చంద్రుడే సూపర్‌మూన్.
చిన్నూ: ఈ సూపర్ మూన్ గులాబీ రంగులో కనిపిస్తుందా?
మామయ్య: అదేం లేదు చిన్నూ. ఏప్రిల్ నెలలో కనిపించే చంద్రుడిని పింక్ మూన్ అంటారంతే.
చిన్నూ: అవునా? అలా ఎందుకని?
మామయ్య: ఎందుకంటే? ఈ సమయంలో భూమి మీద నాచు, కొన్ని పువ్వులు గులాబీ రంగులో వికసిస్తాయి. అందుకే ఏప్రిల్ నెలలో కనిపించే చంద్రుడిని పింక్ మూన్‌గా పిలుస్తున్నారు. దీన్నింకా ఎగ్‌మూన్, ఫిష్‌మూన్, స్ప్రౌటింగ్ మూన్, గ్రాస్‌మూన్ అనీ అంటారు.
చిన్నూ: ఓహో... ఈ సూపర్ మూన్‌ని చూడాలని ఉంది. ఎప్పుడు వస్తుంది మామయ్యా?
మామయ్య: కాసేపట్లో...
చిన్నూ: ఇది పొద్దున కదా...
మామయ్య: అవును మరి. మనదేశంలో ఈ పింక్ మూన్ సంపూర్ణ కాంతిమంతంగా ఉదయం 8 గంటలప్పుడే కనిపిస్తుంది. కానీ సూర్యుడి వెలుగు వచ్చేస్తుంది కదా.. అందుకే మనకు అంత స్పష్టంగా కనిపించదు.
చిన్నూ: అలాగా! ఇంతకీ ఏ తీరులో కనిపిస్తాడబ్బా?
మామయ్య: ఈ చంద్రుడు కొద్దిసేపు లేత బంగారు వర్ణంలో, ఆ తర్వాత తెల్లని కాంతితో మెరుస్తాడు. ఈరోజు కనిపించే చంద్రుడు భూమికి దగ్గరగా అంటే సుమారు 3,56,907 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. అందుకే సాధారణ పూర్ణచంద్రుని కన్నా 14 శాతం పెద్దగా, 30 శాతం అధిక కాంతితో ప్రకాశిస్తూ కనిపిస్తాడు.
చిన్నూ: భలే భలే... అయితే మనకి కనిపించకపోవడం కొంచెం బాధగా ఉంది. ఇలాంటి సూపర్ మూన్ రావడం మొదటిసారా?
మామయ్య: అదేం లేదు చిన్నూ. ఈ ఏడాదిలో ఇది రెండో సూపర్ మూన్. పోయిన నెల అంటే మార్చి 9న మొదటి సూపర్ మూన్ కనిపించింది. ఆ సూపర్ మూన్‌ను సూపర్ వార్మ్ మూన్ అన్నారు. ఎందుకంటే ఆ సమయంలో వానపాములు కనిపించడం మొదలవుతుంది.
చిన్నూ: ఇంతకీ ఈ సూపర్‌మూన్స్ ఎందుకు, ఎన్నేళ్లకు వస్తాయి?
మామయ్య: మరేమో... సూపర్‌మూన్ అనే పదాన్ని 1979లో రిచర్డ్‌నోలి అనే ఒక పరిశోధకుడు పరిచయం చేశాడు. భూమి చుట్టూ వర్తులాకారంగా కాకుండా దీర్ఘ వృత్తాకారంగా తిరగడం వల్ల చంద్రుడు ఒకొక్కప్పుడు భూమికి దగ్గరగా వస్తాడు. అప్పుడు భూమి మీద నుంచి చూసినప్పుడు చంద్రుడు పెద్దగా కనిపిస్తాడు. ఇక ఎన్ని ఏళ్లకు ఈ సూపర్ మూన్స్ వస్తాయంటే... ప్రతి సంవత్సరంలో వచ్చే 12 లేదా 13 పూర్ణచంద్రుళ్లలో సాధారణంగా వాటిలో కొన్ని సూపర్‌మూన్స్‌గా వర్గీకరిస్తారు. పోయిన నెల 9న మొదటి సూపర్‌మూన్ కనిపించింది. మళ్లీ ఈరోజున సూపర్‌మూన్ కనిపించబోతోంది.
చిన్నూ: మరి ఈ ఏడాది అదే 2020లో ఎన్ని సూపర్‌మూన్స్ వస్తాయి?
మామయ్య: ఈ సంవత్సరంలో మొత్తం 13 సార్లు పూర్ణచంద్రుడు దర్శనం ఇస్తాడు. ఒక నెలలో రెండు పూర్ణచంద్రులు కనిపిస్తాయి. ఇందులో 2 సూపర్‌మూన్స్ ఉన్నాయి.
చిన్నూ: అబ్భో. మీకు చాలా విషయాలే తెలుసు మామయ్యా! సరే టైం అవుతోంది.. పింక్‌మూన్ కొంచెమైనా కనిపిస్తుందేమో చూద్దామా!
- డాక్టర్ సి.వి. సర్వేశ్వర శర్మ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Bandi sanjay: కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలెందుకు భరించాలి? సహించాలి?: బండి సంజయ్
-
General News
Andhra News: పోలీసులకు ఎదురుదెబ్బ.. అంజన్‌ను విడుదల చేయాలని కోర్టు ఆదేశం
-
India News
Karnataka: భాజపా.. కాంగ్రెస్.. ముఖ్యమంత్రి ‘ముఖచిత్రం’ ఉంటుందా..?
-
Politics News
Harish Rao: ఇదేనా భాజపా చెబుతోన్న అమృత్కాల్?: హరీశ్‌రావు ఫైర్
-
Movies News
Social Look: వాణీకపూర్ ‘క్రైమ్ థ్రిల్లర్’.. చీరలో శోభిత హొయలు!
-
Politics News
BS Yediyurappa: సిద్ధూపై యడ్డీ తనయుడి పోటీ..?