అరరే.. అరటి.. భళారే బంటి!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. నా పేరు బంటి. నేను ఈ రోజు మీకు ఓ మ్యాజిక్‌ నేర్పడానికి ఇదిగో.. ఇలా వచ్చాను. ఇది చాలా తేలిక. మరి నేర్చుకుంటారా!

Updated : 20 Apr 2020 01:08 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. నా పేరు బంటి. నేను ఈ రోజు మీకు ఓ మ్యాజిక్‌ నేర్పడానికి ఇదిగో.. ఇలా వచ్చాను. ఇది చాలా తేలిక. మరి నేర్చుకుంటారా!

* మనందరికీ అరటి పండ్లంటే ఇష్టం కదా!

* ఈ రోజు మన మ్యాజిక్‌ అరటి పండుతోనే మరి.

* మీ స్నేహితుడికి ఓ అరటి పండు ఇవ్వండి. చేతితో విరగ్గొట్టకుండా.. దాని తొక్క తీయగానే మధ్యలోకి విరిగి పడేలా చేయమని అడగండి.

* మీ ఫ్రెండ్‌.. కచ్చితంగా ఆ పని చేయలేడు.

* మీరు మాత్రం ఎంచక్కా చేయొచ్చు!

* ఏంటి.. అలా అయోమయంగా చూస్తున్నారు!  ‘ఎలా అబ్బా?’ అని ఆలోచిస్తున్నారా?

* నేను చెబుతాగా ఆ రహస్యమేంటో!


కిటుకు

* మీ స్నేహితుడికి ఇచ్చిన అరటిపండు మాములుదే! అందులో ఏ రహస్యమూ ఉండదు.

* మీ దగ్గర ఉన్న అరటి పండులోనే అసలు కిటుకు ఉంటుంది.

* ఓ టూత్‌పిక్‌ తీసుకుని సరిగ్గా అరటి పండు వంపుతిరిగిన చోట మధ్యలో మెల్లిగా గుచ్చండి.

* ఇది తొక్కను చీల్చుకొని అరటిపండు గుజ్జులోకి వెళ్లాలి.

* ఇప్పుడు నెమ్మదిగా టూత్‌పిక్‌ను పైకి, కిందకు అనండి. లోపల అరటిపండు మధ్యకు కట్‌ అవుతుంది. అరటి పండు తొక్క దెబ్బతినకుండా ఎంతో చాకచక్యంగా ఈ పని చేయాల్సి ఉంటుంది.

* ఈ పనంతా మీ స్నేహితులు రాకముందే చేసి పెట్టుకోవాలి.

* తర్వాత మీరు తొక్క తీయగానే అరటిపండు రెండు ముక్కలవుతుంది.


* మరో విషయం.. ఇది ఒక్కసారికే రాకపోవచ్ఛు ముందు మీరు కాస్త ప్రాక్టీస్‌ చేసుకోవాలి.

* ఒకే అరటిపండు కాకుండా.. ఇలా ఓ అయిదారు చేసి పెట్టుకోండి. మళ్లీ మళ్లీ చేయమని మీ స్నేహితులు అడిగితే చేసి చూపించొచ్ఛు

* ఇలా మీరు ముందే సిద్ధం చేసి పెట్టుకున్న అరటిపండ్లు మాత్రం మ్యాజిక్‌ చేయడానికి ముందు మీ స్నేహితుల చేతికి వెళ్లకుండా చూసుకోండి.

* లాక్‌డౌన్‌ అయిపోయిన తర్వాత సామాజిక దూరం పాటిస్తూ.. సరదాగా ఈ మ్యాజిక్‌ చేయండి. మీ ఫ్రెండ్స్‌ అందరూ అవాక్కవ్వకపోతే ఈ బంటిని అడగండి. ఈలోపు ప్రాక్టీస్‌ చేసుకోండి మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని