చెట్టు.. అదిరేట్టు!

మనందరికీ బొమ్మలు గీయడం అంటే భలే సరదా కదా! పెన్సిళ్లు, స్కెచ్‌లు.. ఇలా బోలెడు సరంజామా కావాలి. కానీ ఇవేమీ లేకుండానే ఎంచక్కా చెట్టు బొమ్మను చేయొచ్చు. ఎలాగో నేర్చుకుందామా మరి!తయారీ విధానం:* ముందుగా అమ్మానాన్న సాయంతో మీ పెరట్లోని కొన్ని ఎండుపుల్లలు తెచ్చుకోండి.* ఇవి వివిధ పరిమాణాల్లో ఉండేలా చూసుకోండి.* చిన్న పేపర్‌ ప్లేట్‌లో కాస్త జిగురు పోసుకోండి....

Published : 05 May 2020 00:26 IST

చూడండి.. చెయ్యండి

మనందరికీ బొమ్మలు గీయడం అంటే భలే సరదా కదా! పెన్సిళ్లు, స్కెచ్‌లు.. ఇలా బోలెడు సరంజామా కావాలి. కానీ ఇవేమీ లేకుండానే ఎంచక్కా చెట్టు బొమ్మను చేయొచ్చు. ఎలాగో నేర్చుకుందామా మరి!
తయారీ విధానం:
* ముందుగా అమ్మానాన్న సాయంతో మీ పెరట్లోని కొన్ని ఎండుపుల్లలు తెచ్చుకోండి.
* ఇవి వివిధ పరిమాణాల్లో ఉండేలా చూసుకోండి.
* చిన్న పేపర్‌ ప్లేట్‌లో కాస్త జిగురు పోసుకోండి.


* చెవులు శుభ్రం చేసుకునే కాటన్‌ బడ్‌ను ఒకదాన్ని తీసుకుని కాస్త లావు, పొడవున్న కర్రపుల్లకు దీని సాయంతో జిగురు రాయండి.
* నెమ్మదిగా చార్ట్‌పై ఈ కర్రపుల్లను అతికించండి. ఇది చెట్టు కాండం అన్నమాట.


* తర్వాత చిన్న.. చిన్న.. పుల్లలు తీసుకుని చిన్న కొమ్మల్లా ఇలాగే అతికించండి. కాసేపు ఆరనివ్వండి.
* తర్వాత మరో కాటన్‌ బడ్‌ను తీసుకుని తెల్లరంగులో ముంచి చిత్రంలో చూపించినట్లుగా అద్దండి. ఇది మంచు అన్నమాట.


* చెట్టు మొదలు దగ్గర ఎక్కువగా అద్దండి.. చెట్టు పైన, చుట్టుపక్కల అక్కడక్కడ పై నుంచి మంచుపడుతున్నట్లు అద్దండి. ఆరిన తర్వాత దీన్ని అమ్మానాన్న సాయంతో షోకేస్‌ గ్లాసుకో, మీ స్టడీరూంలోనో అతికించుకోండి.
* కాస్త లావున్న చార్టు మీద అయితే రెండువైపులా ఇలా చేసి.. దారంతో వేలాడదీసుకున్నా.. చూడటానికి భలేగా ఉంటుంది.
కావాల్సిన వస్తువులు
* ఎండిపోయిన కర్ర పుల్లలు
* జిగురు (గమ్‌)
* తెల్ల రంగు
* చెవులు శుభ్రం చేసుకునే కాటన్‌ బడ్స్‌
* చార్ట్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని