గిరగిరా.. గింగిరాలు తిరిగి..
మీరు ఎప్పుడైనా మ్యాజిక్ షోకు వెళ్లారా?! పోనీ టీవీలో అయినా చూశారా? అందులో ఎక్కువగా మ్యాజిక్‌లు పేకముక్కలతో చేస్తుంటారు కదా! ముఖ్యంగా ప్లేయింగ్ కార్డ్‌ను గాల్లోనే గిరగిరా గింగిరాలు తిరిగేలా చేస్తారు. అదెలా చేస్తారో.. మనం ఈ రోజు నేర్చుకుందామా?
* మీరు ప్లేయింగ్ కార్డును ఓ చేతిలో తీసుకోండి.
* ఇప్పుడు మరో చేతిని దానిపైన గాల్లో అటూ ఇటూ తిప్పండి.
* అంతే కార్డు గాల్లో లేచి గిరగిరా తిరుగుతుంది.
* మీరు ఎంత ప్రయత్నించినా రావడం లేదు కదూ! మరి దీనికో ట్రిక్ ఉంది.
* అదేంటో తెలుసుకుంటే మీరు ఎంచక్కా చేసేయొచ్చు
కిటుకు:
* ఈ మ్యాజిక్ చేయడానికి ముందే మనం కొన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఓ నల్లటి దారాన్ని పేకముక్క మధ్యలో పారదర్శక టేప్ (కరెన్సీ నోట్లు చిరిగితే అతికించే టేప్) సాయంతో అతికించాలి.
* దారానికి మరో చివర వేలు పెట్టుకునేలా ఏర్పాటు ఉండేలా ముడి వేసుకోండి.
* ఇలా ముడి వేసి పెట్టుకున్న దారాన్ని ఇప్పుడు మీ చొక్కా గుండీకి తగిలించుకోండి.
* ఇప్పుడు కార్డును ఎడమచేతిలోకి తీసుకోండి.
* తర్వాత కుడి చేతిని కార్డు మీద గాల్లో పెట్టండి.
* ఇలా చేసేటప్పుడు కుడి చేతి బొటనవేలు, చూపుడు వేళ్ల మధ్య లేదా.. మీకు అనుకూలంగా ఉండే మరేవైనా రెండు వేళ్ల మధ్యలోకి కార్డుకున్న దారం వచ్చేలా చూసుకోండి.
* ఇప్పుడు నెమ్మదిగా కుడి చేతిని గాల్లోకి లేపండి.
* దారంతో పాటు కార్డుకూడా లేస్తుంది.
* మరో చేతితో నెమ్మదిగా కార్డు కొనను తిప్పండి.
* ఇంకేం కార్డు తిరుగుతుంది. ఇది చూసేవారికి గాల్లో తిరుగుతున్నట్లే కనిపిస్తుంది.
* ఈ ఏర్పాట్లన్నీ ఎవరూ చూడకముందే చేసి పెట్టుకోవాలి.
* చూసేవారికి కాస్తదూరంలో ఉండే.. ఈ మ్యాజిక్ చేయాలి.
* ఈ మ్యాజిక్ చేసేటప్పుడు నల్లటి చొక్కా ధరించాలి. అప్పుడే ప్లేయింగ్ కార్డుకు అతికించిన నల్లటి దారం చూసేవారికి కనిపించదు.
* ఓ అయిదారుసార్లు ప్రాక్టీస్ చేస్తే మీరు దీన్ని చాలా చక్కగా చేయగలుగుతారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!
-
World News
Heartbreaking Story: మా అమ్మ కన్నీటితో డైరీలో అక్షరాలు తడిసిపోయాయి..!