గురి చూసి కొట్టేద్దామా!
ఫ్రెండ్స్.. బాగున్నారా! ఈ రోజు మనం మరో కొత్త ఇండోర్ గేమ్ నేర్చుకుందామా! ఇది భలే సరదాగా ఉంటుంది. ఎక్కువ స్థలమూ అవసరం లేదు. ఎంచక్కా.. ఒక్కరే ఆడుకోవచ్చు.
ఈ గేమ్ ఆడాలంటే.. మనం కాస్త అమ్మానాన్న సాయం తీసుకోవాల్సి వస్తుంది.
* కాస్త పెద్ద సైజు అట్టపెట్టెను తీసుకొని చిత్రంలో చూపించినట్లు దానికి దారాలతో పేపర్ లేదా ప్లాస్టిక్ కప్పులను వేలాడదీయాలి.
* వీటి మధ్య కాస్త దూరం ఉండాలి. ఒకటి పైన ఉంటే.. మరోటి కాస్త కింద వేలాడేలా దారంతో కట్టుకోవాలి.
* ఒక్కో గ్లాసుపై 10, 20, 30, 40 ఇలా ఒక్కో సంఖ్య స్కెచ్‌తో వేసుకోవాలి. ఇవి స్కోర్లన్నమాట.
* ఇదంతా మనం చేసుకోవాలంటే కాస్త కష్టం కాబట్టి అమ్మానాన్నను చేసి ఇవ్వమని అడగండి సరేనా!
ఎలా ఆడాలంటే..
* ఇప్పుడు ఆడే విధానం ఎలాగో తెలుసుకుందాం.
* అట్టపెట్టెను సిద్ధం చేసుకున్న తర్వాత.. దానికి కొంచెం దూరంలో హాయిగా కూర్చోవాలి.
* ఇప్పుడు ఓ మెత్తటి బంతిని తీసుకొని నెమ్మదిగా గురి చూసి కప్పులకు తాకేలా విసరాలి.
* బంతి ఒకే కప్పునకు తాకాలి. రెండింటికి తాకితే మైనస్.
* ఏ కప్పునకు తాకితే.. ఆ కప్పు మీద ఉన్న సంఖ్యే మన స్కోర్.
* ముందు కష్టంగా అనిపించినా.. తర్వాతర్వాత కప్పులను బంతితో కొట్టగలం.
* మనకు కాస్త తేలిగ్గా అనిపించినప్పుడు మరి కాస్త దూరం వెనక్కి జరిగి కూర్చొని బంతితో కప్పులను కొట్టాలి.
ప్రయోజనం:
* మెదడు చేతి సమన్వయం మెరుగవుతుంది.
* బంతితో కప్పులను కొట్టిన ప్రతిసారి లేచి వెళ్లి బంతిని తెచ్చుకోవాల్సి వస్తుంది. దీని వల్ల శారీరక వ్యాయామం దొరుకుతుంది.
* కప్పుల మీద దృష్టి నిలపాల్సి ఉంటుంది కాబట్టి ఏకాగ్రత అలవాటు అవుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Rajasthan: పెట్రోల్ ట్యాంకర్లో మద్యం అక్రమ రవాణా..!
-
World News
Australia: డాల్ఫిన్లతో ఈతకని దిగి.. సొర చేపకు చిక్కి..!
-
Sports News
Gill: ‘శుభ్‌మన్.. నాగ్‌పుర్ ఏదో చెబుతోంది చూడు’’: ఉమేశ్ యాదవ్ ఫన్నీ ట్వీట్
-
World News
Wikipedia: పాక్‌లో వికీపీడియాపై నిషేధం.. స్పందించిన వికీమీడియా
-
General News
Rushikonda: బోడికొండకు కవరింగ్.. జర్మన్ టెక్నాలజీతో జియో మ్యాటింగ్
-
Sports News
IND vs AUS: స్టీవ్ స్మిత్‌ని ఆ స్పిన్నర్ ఇబ్బందిపెడతాడు: ఇర్ఫాన్ పఠాన్