చక్కని హెలికాప్టర్‌ చేసేద్దామా!

హెలికాప్టర్‌ భలే ఉంటుంది కదూ! మనం ఈ రోజు ఇంట్లోనే ఓ హెలికాప్టర్‌ బొమ్మను తయారు చేయడం ఎలాగో నేర్చుకుందామా! కానీ దీని తయారీకి కచ్చితంగా అమ్మానాన్న సాయం తీసుకోవాలి సరేనా? ఇంకెందుకాలస్యం మమ్మీడాడీని పిలవండి మరి!

Published : 19 May 2020 00:19 IST

చూడండి.. చెయ్యండి

హెలికాప్టర్‌ భలే ఉంటుంది కదూ! మనం ఈ రోజు ఇంట్లోనే ఓ హెలికాప్టర్‌ బొమ్మను తయారు చేయడం ఎలాగో నేర్చుకుందామా! కానీ దీని తయారీకి కచ్చితంగా అమ్మానాన్న సాయం తీసుకోవాలి సరేనా? ఇంకెందుకాలస్యం మమ్మీడాడీని పిలవండి మరి!


తయారీ విధానం

* అమ్మానాన్నను ప్లాస్టిక్‌ బాటిల్‌ను చిత్రంలో చూపించినట్లు కత్తిరించమనండి.

* బాటిల్‌ మూతకు మధ్యలో చిన్న రంధ్రం చేయండి.
* ఈ రంధ్రంలో వంపు తిరిగి ఉన్న స్ట్రాను పెట్టండి. ఇది హెలికాప్టర్‌ తోక అన్నమాట!

* ప్లాస్టిక్‌ బాటిల్‌ నుంచి అర్ధసున్నా ఆకారంలో కత్తిరించి పెట్టుకున్న ముక్కకు చిత్రంలో చూపించినట్లుగా రెండు స్ట్రాలను స్టాప్లర్‌ పిన్లతో అతికించుకోవాలి.
* ఇప్పుడు దీని పైభాగాన ఇంతకుముందు తోకతో సిద్ధం చేసుకున్న ప్లాస్టిక్‌ బాటిల్‌ను గమ్‌సాయంతో అతికించుకోవాలి. కాసేపు ఆరిన తర్వాత స్టాప్లర్‌ పిన్‌ కూడా వేసుకోవచ్చు.

* ఇప్పుడు టేబుల్‌టెన్నిస్‌ బాల్‌ను బాటిల్‌కు తెరిచిఉన్న వైపు పెట్టాలి. ఇది హెలికాప్టర్‌ క్యాబిన్‌ అన్నమాట!
* ఈ బంతి బయటకు రాకుండా నెమ్మదిగా గమ్‌తో అతికించుకోవాలి.
* రెండు స్ట్రా ముక్కలను పిన్‌తో రెక్కల్లా జాగ్రత్తగా గుచ్చాలి. గమ్‌సాయంతోనూ ఇలా చేసుకోవచ్చు. .

* కాసేపు ఆరిన తర్వాత హెలికాప్టర్‌ రెక్కల స్థానంలో అతికించాలి.
ఇంకేం చక్కని హెలికాప్టర్‌ బొమ్మ సిద్ధం. దీన్ని ఎంచక్కా షోకేస్‌లో పెట్టేసుకోండి. అంతకుముందు ఈ బొమ్మతో ఓ సెల్ఫీదిగడం మాత్రం మరిచిపోకండి.


కావాల్సిన వస్తువులు

1. మూత ఉన్న ప్లాస్టిక్‌ బాటిల్‌ (చిత్రంలో చూపించినట్లు ఉండాలి)
2. వంపు తిరిగి ఉన్న స్ట్రాలు
3. టేబుల్‌ టెన్నిస్‌ బాల్‌
4. జిగురు (హాట్‌ గ్లూ, ఫెవిక్విక్‌ లాంటివి)
5. కత్తెర
6. స్టాప్లర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని