అరచేతుల్లో అద్భుత మాయ!

ఫ్రెండ్స్‌.. మనం ఇంతకు ముందు ప్లేయింగ్‌ కార్డును గాల్లోనే గిరగిర తిప్పే మ్యాజిక్‌ నేర్చుకున్నాం కదా! ఈ రోజు అలాంటిదే మరో మ్యాజిక్‌ చేయడం ఎలాగో తెలుసుకుందామా.. ఒక చేతిలోంచి మరో చేతిలోకి కార్డు గాల్లోనే తేలుతూ చేరుకుంటుంది. మీకూ నేర్చుకోవాలని ఉందా? ఇంకెందుకాలస్యం చదివేయండి మరి!

Updated : 25 May 2020 00:38 IST

ఫ్రెండ్స్‌.. మనం ఇంతకు ముందు ప్లేయింగ్‌ కార్డును గాల్లోనే గిరగిర తిప్పే మ్యాజిక్‌ నేర్చుకున్నాం కదా! ఈ రోజు అలాంటిదే మరో మ్యాజిక్‌ చేయడం ఎలాగో తెలుసుకుందామా.. ఒక చేతిలోంచి మరో చేతిలోకి కార్డు గాల్లోనే తేలుతూ చేరుకుంటుంది. మీకూ నేర్చుకోవాలని ఉందా? ఇంకెందుకాలస్యం చదివేయండి మరి!
* మీరు ముందుగా ప్లేయింగ్‌ కార్డును ఓ చేతిలోకి తీసుకోండి.
* అబ్రకదబ్ర హాంఫట్‌ అంటూ చేతిని తెరవండి.
* ప్లేయింగ్‌ కార్డు గాల్లో తేలుతూ మరో చేతిలోకి వెళ్లాలి.
* మీరు ఎన్ని సార్లు చేసినా వెళ్లడం లేదు కదూ!
* ప్చ్‌.. అలా చిన్నబుచ్చుకోకండి. ఆ ట్రిక్‌ ఏంటో తెలుసుకోండి.
* అప్పుడు ఎంచక్కా మీరూ చేసేయొచ్చు.

కిటుకు:

* ఈ మ్యాజిక్‌ చేయడానికి ముందే మనం ఓ ఏర్పాటు చేసుకోవాలి.
* నల్లటి దారం, ప్లేయింగ్‌ కార్డు, స్ట్రా ముక్క, పారదర్శక టేప్‌(కరెన్సీ నోట్లు చిరిగితే అతికించేది) కానీ జిగురు కానీ కావాల్సి ఉంటుంది.
* చిత్రంలో చూపించినట్లుగా కార్డుకు వెనక వైపు స్ట్రాను టేప్‌ లేదా గమ్‌తో అతికించుకోవాలి.
* ఇప్పుడు ఈ స్ట్రాలోంచి నల్లటి దారాన్ని తీయాలి. ఓ కొనను ఎడమ చేతి బొటన వేలికి తగిలించుకునే ఏర్పాటు చేసుకోవాలి. మరో కొనను కార్డుకే ఇంతకు ముందు అతికించుకున్న స్ట్రాకు కాస్త కింద అతికించుకోవాలి.
* ఇదంతా మ్యాజిక్‌ చేయడానికి ముందే.. మనం రహస్యంగా చేసి పెట్టుకోవాలి.
* ఇప్పుడు ఓ చేతిలో కార్డును తీసుకుని వీక్షకులకు చూపించాలి.


* నెమ్మదిగా కార్డును వదిలేయాలి. దారాన్ని మాత్రం చేతి వేలికి అలాగే తగిలించుకుని ఉండాలి.
* ఇప్పుడు మరో చేతిని నెమ్మదిగా దూరం జరపాలి. ఇప్పుడు కార్డు మరో చేతిలోకి దారం సాయంతో చేరుతుంది.
* ఇది చూసే వారికి ప్లేయింగ్‌ కార్డు గాల్లో ప్రయాణించి చేరినట్లు కనిపిస్తుంది.  
* ఈ మ్యాజిక్‌ చేసేటప్పుడు నల్లటి చొక్కా ధరించాలి. ఇలా చేస్తే కార్డుకు అమర్చిన నల్లదారం ప్రేక్షకులకు కనిపించకుండా ఉంటుంది.
* వీక్షకులు మనకు మరీ దగ్గరకు రాకుండా చూసుకోవాలి.
* ఇంకేం ప్రాక్టీస్‌ చేసేయండి మరి.
* మనలో మనమాట. ఈ రహస్యం ఎవరికీ చెప్పొద్దు. ష్‌..ష్‌! గప్‌చుప్‌!



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని