ఎంచక్కా చేద్దామా చక్కని విమానం!

‘రెక్కలుంటాయి కానీ పక్షి కాదు. అయినా దూర తీరాలకు ఎగురుతుంది.. ఏంటది? చెప్పుకోండి?’.. ఓస్‌.. ఈ పొడుపు కథ సమాధానం మాకు తెలుసోచ్‌! అంటారా?! జవాబు తెలిస్తే తెలిసింది.. మరి విమానం తయారు చేయడం వచ్చా మీకు? రాదు కదూ! మరేం ఫర్లేదు.. ప్లాస్టిక్‌ సీసాతో ఓ చక్కని విమానం ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం సరేనా?!...

Updated : 01 Jun 2020 23:12 IST

చూడండి..

చెయ్యండి

‘రెక్కలుంటాయి కానీ పక్షి కాదు. అయినా దూర తీరాలకు ఎగురుతుంది.. ఏంటది? చెప్పుకోండి?’.. ఓస్‌.. ఈ పొడుపు కథ సమాధానం మాకు తెలుసోచ్‌! అంటారా?! జవాబు తెలిస్తే తెలిసింది.. మరి విమానం తయారు చేయడం వచ్చా మీకు? రాదు కదూ! మరేం ఫర్లేదు.. ప్లాస్టిక్‌ సీసాతో ఓ చక్కని విమానం ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం సరేనా?!

ఏమేం కావాలంటే..

ప్లాస్టిక్‌ సీసా ● రంగుల చార్టులు ● జిగురు (గమ్‌) లేదా పారదర్శక టేప్‌ (కరెన్సీ నోట్లు చిరిగితే అతికించేది)

ఎలా చేయాలంటే..

ముందుగా ప్లాస్టిక్‌ సీసా తీసుకోండి. ఒకటో చిత్రంలో చూపించినట్లు రెండు తెల్ల చార్టులను గమ్‌తో లేదా టేప్‌తో అతికించుకోండి. చివర్లో విమానం తోక ఆకారం వచ్చేలా చూసుకోవాలి.

తర్వాత రెండో చిత్రంలో చూపించినట్లు తెల్ల చార్టును నీళ్ల సీసాకు అతికించుకోండి.

సీసా మూత పరిమాణంలో గుండ్రంగా కొన్ని ముక్కలు అమ్మానాన్న సాయంతో కత్తిరించిపెట్టుకోండి. ఇవి విమానం కిటికీలన్నమాట.

తర్వాత కాషాయం రంగులోని చార్టులను గుండ్రంగా చుట్టుకొని.. ప్లాస్టిక్‌ సీసాకు పక్కల్లో అతికించుకోండి.

ఇప్పుడు మెరూన్‌ రంగులోని చార్టును రెక్కల్లా కత్తిరించుకుని.. ఇంతకు ముందు సిద్ధం చేసుకున్న కాషాయం రంగు చార్టులపై జాగ్రత్తగా అతికించండి.

తర్వాత తోక భాగంలో చిన్నగా కత్తిరించి పెట్టుకున్న చిన్న రెక్కలవంటి చార్టు ముక్కలను అతికించుకోండి.

తర్వాత కిటికీల ఆకారంలో తయారు చేసి పెట్టుకున్న చార్టు ముక్కలనూ అతికించండి.

చివరగా విమానం ప్రొపెల్లర్‌లా కత్తిరించి పెట్టుకున్న చార్టు ముక్కను ప్లాస్టిక్‌సీసా మూత వద్ద సిద్ధం చేసుకోండి.

ఇంకేం విమానం తయార్‌! ఎంచక్కా షోకేస్‌లో పెట్టేయండి మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని