అదిరేట్టు.. చకచకా.. చెట్టు!

పచ్చని చెట్లు చూడటానికి బాగుంటాయి కదూ! అంతే కాదు.. పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే మనం వీలుంటే ప్రతి పుట్టినరోజుకు కనీసం ఓ మొక్కను నాటి దాన్ని సంరక్షించాలి.. సరేనా! ఇక ఇప్పుడైతే చార్టులతో చూడచక్కని చెట్టుబొమ్మను తయారు చేయడం ఎలాగో నేర్చుకుందామా!

Published : 08 Jun 2020 00:44 IST

చూడండి చెయ్యండి

పచ్చని చెట్లు చూడటానికి బాగుంటాయి కదూ! అంతే కాదు.. పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే మనం వీలుంటే ప్రతి పుట్టినరోజుకు కనీసం ఓ మొక్కను నాటి దాన్ని సంరక్షించాలి.. సరేనా! ఇక ఇప్పుడైతే చార్టులతో చూడచక్కని చెట్టుబొమ్మను తయారు చేయడం ఎలాగో నేర్చుకుందామా!


ఏమేం కావాలంటే..

* రంగు రంగుల చార్టులు,

* జిగురు (గమ్‌)


ఎలా చేయాలంటే..

* ముందుగా ఓ చార్టు తీసుకోండి.

* దీనిపై కార్డుబోర్డు రంగులో ఉండే చార్టును చెట్టు కాండం, కొమ్మల ఆకారంలో అమ్మానాన్న సహకారంతో కత్తిరించుకుని అతికించుకోవాలి.

* కాసేపు ఆరనివ్వాలి. ఈ లోగా రంగురంగుల చార్టులను పొడవాటి ముక్కలుగా కత్తిరించుకోవాలి. ●

* ఒక కొనను మరో కొనతో కలిపి వృత్తాకారంలో అతికించుకోవాలి.

* ఇలా మనకు కావాల్సినన్ని సిద్ధం చేసుకోవాలి.

* తర్వాత చెట్టు కొమ్మలకు ఈ వృత్తాలను అతికించుకుంటూ వెళ్లాలి.

* చివర్లో ఆకుపచ్చ రంగు చార్టును ముక్కలుగా కత్తిరించుకుని చెట్టు మొదలు దగ్గర అటూ ఇటూ అతికించుకోవాలి. ఇది నేలపై పెరిగిన గడ్డి అన్నమాట.

* ఓ నాలుగు వృత్తాలనూ.. ఆకుపచ్చ రంగు చార్టుపై అతికించుకోవాలి. ఇవి నేలరాలిన ఆకుల్లాగా కనిపిస్తాయి.

* ఇంకేం.. చెట్టు సిద్ధం. ఎంచక్కా షోకేస్‌లో పెట్టేసుకోండి.

* అంతకంటే ముందు దీంతో ఓ సెల్ఫీ దిగడం మాత్రం మరిచిపోకండేం!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని